సమంతాను 'ఛీటర్' అంటూ రెచ్చిపోయిన అల్లు శిరీష్
అల్లు శిరీష్ రీసెంట్ గా ట్విట్టర్ లో సమంతను ఉద్దేశ్శించి.."ఛీటర్..నువ్వు నాతో ఏమని చెప్పావు..ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని అన్నావు.అలాగే ఇంకెప్పుడూ ట్వీట్ చెయ్యనని అన్నారు..మరి ఏంటి ఇది?" అన్నారు. ఆమె తాజాగా ట్విట్టర్ లో బృందావనం చిత్రం సక్సెస్ మీట్ ని నవోటెల్ లో జరుగనుందని, దానికి తాను హాజరవుతున్నానని అంది. ప్రస్తుతం ఆమె టర్కీలో దూకుడు చిత్రం నిమిత్తం ఉంది. ఈ రోజే ఆమె తిరుగు ప్రయాణం అవుతుంది. ఇక ఏ మాయ చేసావే చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ...తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేసింది. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న దూకుడు చిత్రంలో చేస్తోంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే దూకుడు చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











