Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్ తో షాక్ ఇచ్చిన అల్లు శిరీష్.. ఇంట్లో బుద్ధిమాన్, బయట శక్తిమాన్!

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గత కొంతకాలంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతను డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన సక్సెస్ రావడం లేదు. ఇక ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఒక డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి రొమాంటిక్ సన్నివేశాలతో శిరీష్ షాక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతుంది. ఊర్వశివో.. రాక్షసివో.. అనే సినిమా చేస్తున్న అల్లు శిరీష్ నేడు ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

టీజర్ ముందు వరకు కూడా ఈ సినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే మొదటిసారి అల్లు శిరీష్ లిప్ లాక్ సన్నివేశాలతో షాక్ ఇచ్చాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో ఊహించిన విధంగా కనిపించింది. ఇక ఆఫీస్ లో కొలీగ్స్ గా ఉన్న హీరో హీరోయిన్ ఆ తర్వాత రొమాంటిక్ లైఫ్ లో ఎంజాయ్ చేసిన అనంతరం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది సినిమా కథ అని తెలుస్తోంది.

Allu sirish upcoming movie Urvasivo Rakshasivo Teaser released

ఇక హీరోయిన్ ఇది జస్ట్ ఫ్రెండ్లీ మాత్రమే అని చెప్పడం ఇక తర్వాత హీరో నేను నిజంగానే ప్రేమించాను అని చెప్పడంతో సినిమా మరో ట్రాక్ లోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. ఈ డిఫరెంట్ రొమాంటిక్ సినిమా వెండితెరపై ఏమాత్రం క్లిక్ అవుతుందో చూడాలి. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఈ సినిమాలో హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. పోసాని కృష్ణమురళి కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను GA2 సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పై ధీరజ్ - విజయ్ ఈ సినిమాను సంయుక్తంగా నేర్పిస్తున్నారు. ఇక సినిమాను నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X