సెట్స్‌పై ఇద్దరు మెగాస్టార్లతో అల్లు వారబ్బాయి.. షాకింగ్ లుక్ వైరల్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి నటించిన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది. కానీ తాజాగా ఈ సినిమా సెట్స్‌పై ఆ ఇద్దరి నడుమ అల్లు వారబ్బాయి ఉన్న ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Recommended Video

KTR Will Not Attend Sye Raa Audio Function || కారణం ఏమిటో తెలుసా?
అటు చిరు ఇటు అమితాబ్

అటు చిరు ఇటు అమితాబ్

టాలీవుడ్, బాలీవుడ్ ఐకాన్స్ ఇద్దరూ చెరో పక్క నిల్చోగా మధ్యలో అల్లు శిరీష్ నిల్చొని ఫోటోకి పోజిచ్చాడు. అయితే ఈ పిక్‌లో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లుక్‌లో, అదే విధంగా అమితాబ్ బచ్చన్ పూర్తి గడ్డంతో సైరా సినిమాలోని వేషాధారణతో కనిపించడంతో వెంటనే వైరల్‌గా మారింది. సరదాగా సెట్స్‌పై అల్లు శిరీష్ ఈ ఫోటో దిగాడని సమాచారం.

విడుదలకు ముందే సైరా సెన్సేషన్

విడుదలకు ముందే సైరా సెన్సేషన్

చిరంజీవి మెగా ప్రాజెక్టు 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. దేశంలోని అన్ని భాషా చిత్రాల పరిశ్రమలు ఈ భారీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయి.

భారీ తారాగణం.. మెగాస్టార్ ఇంట్రెస్ట్

భారీ తారాగణం.. మెగాస్టార్ ఇంట్రెస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిరంజీవి సహా రామ్ చరణ్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. చారిత్రాత్మక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. తమన్నా, కుచ్చ సుదీప్, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

చిరంజీవి కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సైరా నరసింహా రెడ్డి' కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X