twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ వివాదం..అసలేం జరిగింది?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ సర్కిల్స్ లో అల్లు శిరీష్ పబ్ వివాదం గురించి మాటలే. ఈ వివాదంలో నిజమేంటి..అనేది అందరిలో ఆసక్తికరమైన చర్చ. రాజధానిలోని ఓ పబ్‌లో అర్ధరాత్రి ముగ్గురు యువకులు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళా ఫోటోగ్రాఫర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు నిర్మాత అల్లు అరవింద్‌ కొడుకు అల్లు శిరీష్‌ అనే ఆరోపణలు వినిపిస్తుండడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

    పోలీసులు, విశ్వసనీయవర్గాల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన తేజల్‌ పరాన్‌ షా అనే ఫోటోగ్రాఫర్‌ బ్రిటన్‌కు చెందిన మహిళా డీజే ఫైజా బబుల్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ దసపల్లా హోటల్‌లోని 'ఓవర్‌ ది మూన్‌' పబ్‌లో డీజేకు వచ్చారు. శనివారం రాత్రి ఫైజా సంగీతంతో హోరెత్తిస్తుండగా తేజల్‌ ఫొటోలు తీసుకుంటున్నారు.

    అల్లు అరవింద్‌ కుమారులైన హీరో అర్జున్‌, అతడి సోదరులు వెంకట్‌, శిరీష్‌లు కుటుంబసభ్యులతో కలిసి అదే పబ్‌కు వచ్చారు. హోరెత్తుతున్న సంగీతానికి కుర్రకారు హుషారుగా వూగుతున్నారు. తేజల్‌ పదే పదే ఫోటోలు తీస్తుండటంతో అల్లు శిరీష్‌ ఆమెను హెచ్చరించినట్టు తెలిసింది. ఈ సందర్భంలో ముగ్గురు యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అర్జున్‌, శిరీష్‌లు పబ్‌ నుంచి వెళ్లిపోయారు.

    అసభ్యకరంగా ప్రవర్తించినవారు ఫలానావారని అక్కడున్న కొందరు తేజల్‌కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడానికి సిద్ధపడ్డారు. అప్పటికి అక్కడే ఉన్న అల్లు వెంకట్‌ ఆమెను వారించినట్టు తెలిసింది. అయినా తేజల్‌ వినలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.

    అందులో ఆమె ఎవరి పేర్లనూ ప్రస్తావించకపోవడంతో గుర్తుతెలియని యువకులపై సెక్షన్‌ 354, 506, రెడ్‌విత్‌ 34 కింద కేసులు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ డి.వి.ప్రదీప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనలో అల్లు శిరీష్‌ ఉన్నాడని, ఇద్దరు స్నేహితులతో సహా అతడు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ టీవీల్లో హోరెత్తడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.

    ఈ అంశాన్ని శిరీష్‌, పోలీసులు వేర్వేరుగా ఖండించారు. తాను అంతక్రితమే అక్కడి నుంచి వెళ్లిపోయానని శిరీష్‌ ప్రకటించగా.. విచారణ చేయకుండానే పేర్లు ఎలా చెబుతామంటూ పోలీసు అధికారులు అంటున్నారు.

    English summary
    
 A female videographer, who came in to shoot Mumbai DJ Ma Faiza’s birthday gig, was attacked by a group of revellers accompanying a "powerful person". Though there is no confirmation, the person is allegedly Tollywood actor Allu Sirish — he strongly denies his involvement. The incident took place at the nightclub Over the Moon around 1 am, with the videographer being ‘touched, grabbed and pushed around’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X