అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సరికొత్త రికార్డ్.... సౌత్ నెం1, ఇండియాలో నెం.2
Recommended Video

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఉన్నట్టుండి హాట్ టాపిక్ అయ్యారు. తెలుగులో ఏ స్టార్ హీరో భార్య సాధించని సరికొత్త రికార్డు ఆమె సొంతం చేసుకుంది. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు, సౌతిండియా వ్యాప్తంగా చూసుకున్నా... క్వీన్ ఆఫ్ సోషల్ మీడియా అనే ట్యాగ్ ఆమెకే దక్కుతుంది. స్నేహారెడ్డి ఈ ఘనత సాధించడానికి కారణం ఇన్‌స్టాగ్రామ్.
గత కొన్ని నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న స్నేహారెడ్డి 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం 1 మిలియన్ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. సినిమాల్లో నటించకుండా కేవలం స్టార్ హీరో వైఫ్ హోదాలో ఇంత ఫాలోయింగ్ సాధించడం మామూలు విషయం కాదు.

సౌత్ నెం.1... ఇండియాలో నెం.2
సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరో భార్యకు ఇంత ఫాలోయింగ్ లేదు. అయితే దేశ వ్యాప్తంగా తీసుకుంటే.... స్నేహారెడ్డి కంటే ముందు స్థానంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ ఉన్నారు.

స్నేహారెడ్డికి ఎందుకింత ఫాలోయింగ్?
అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్నేహారెడ్డి తన ఇన్‌స్టా పోస్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె షేర్ చేస్తున్న పోస్టుల్లో బన్నీ, అయాన్, అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉండటం అభిమానులను మరింత మెప్పిస్తోంది.

సెలబ్రిటీ వైఫ్ హోదా
తెలుగులో ఉండే స్టార్ హీరోల భార్యల్లో అతి కొద్ది మాత్రమే సినిమాలను టచ్ చేయకుండా సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నారు. మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియాలో తమ హవా కొనసాగిస్తున్నారు. నమ్రత నటి. ఉపాసన బిజినెస్ ఉమెన్. అయితే ఇవేవీ లేకుండా స్నేహారెడ్డి వారిద్దరినీ మించిపోయారు.

బన్నీ కెరీర్లో కూడా కీలక పాత్ర
బన్నీ వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డి పాత్ర అత్యంత కీలకమైనది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా సినిమాల సైడ్ పబ్లిసిటీ పరంగా తనవంతు తోడ్పాటు అందించాలని స్నేహారెడ్డి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











