మరో సినిమాకు ఓకే అన్న అల్లు
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో హీరో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇదిఇలా ఉండగానే అల్లు అర్జున్ కు సుకుమార్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. ఇందుకు అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పాడు. ఇంతకుముందు సుకుమార్ ఆర్య, జగడం చిత్రాలకు పనిచేశాడు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో మరో మంచి సినిమాను ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications











