Ram charan బర్త్ డేకు బన్నీ రాకపోవడానికి అసలు కారణం ఇదే.. ఏం జరిగిందంటే?

మెగా ఫ్యామిలీ మధ్యలో విబేధాలు వచ్చాయని అలాగే అల్లు వారితో పడడం లేదని చాలాసార్లు ఇండస్ట్రీలో రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంలో మెగా సన్నిహితులు చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ అయితే ఆగడం లేదు. ఇక అల్లు అర్జున్ ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజును మిస్ అయిన సంఘటన మీడియాలో సంచలనం కలిగించింది. ఇది అనేక రకాల ఊహాగానాలకు దారితీసింది. అయితే, అల్లు అర్జున్ బృందం ఈ పుకార్లపై స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

పుట్టినరోజు సందర్భంగా

పుట్టినరోజు సందర్భంగా

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సెలబ్రెటీలు ఇటీవల సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే కాకుండా రామ్ చరణ్ ప్రత్యేకంగా పార్టీ ఇవ్వగా ఆ వేడుకకు ప్రముఖ సెలబ్రెటీలు వచ్చారు. అయితే మెగా ఫ్యామిలీకి దగ్గరైన అల్లు అర్జున్ రాలేదు. అలాగే అతను ఏ విధంగాను స్పందించలేదని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ప్రతీసారి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్న బన్నీ ఈసారి ఎందుకు చేయలేదు అనే సందేహం అనేక రకాల చర్చలకు దారి తీసింది.

ఫ్యాన్ వార్స్

ఫ్యాన్ వార్స్

ఇక సాధారణంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల బన్నీ, చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా అదే తరహాలో యుద్ధ వాతావరణం కనిపించింది. దారుణంగా నెగిటివ్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇక ఆ ట్వీట్స్ ఎంతగా వైరల్ అవుతున్నా కూడా మొదట్లో ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు.

ఎందుకు రాలేదంటే..

ఎందుకు రాలేదంటే..

అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ సన్నిహితులు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ వియత్నాంకు వెళ్లడం వలన అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందట. పార్టీకి హాజరు కాలేనని బన్నీ ముందుగానే చరణ్ కు క్లారిటీ కూడా ఇచ్చాడట. అలాగే రామ్ చరణ్ సోదరి కూడా విదేశాలకు వెళ్లడం వలన చరణ్ పుట్టినరోజు హాజరు కాలేదు.

వీడియో కాల్‌లో..

వీడియో కాల్‌లో..

ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ వీడియో కాల్‌లో సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు కూడా అల్లు టీమ్ వివరణ ఇచ్చింది. బన్నీ బర్త్ డే పార్టీకి మిస్ అయినా కూడా చరణ్ కు ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి చాలాసేపు మాట్లాడారట. ఇక వారి తదుపరి ప్రాజెక్ట్ లపై ఒకరికొకరు ప్రత్యేకంగా విషెస్ కూడా తెలుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియకుండా కొంతమంది ఫ్యాన్స్ అనవసరంగా సోషల్ మీడియాలో తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అలాగే మరోవైపు రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల టైటిల్ పై అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాను వచ్చి ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X