వెంకీ వెళ్ళి బన్నీ వచ్చె

By Staff

allu arjun
గమ్యం చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ క్రిష్ ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కృష్ణం వందే జగద్గురం చిత్రాన్ని ప్లాన్ చేసారన్న సంగతి తెలిసిందే. అయితే అనేకానేక కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో వెంకి ప్లేస్ లోకి అల్లు అర్జున్ వచ్చారని సమాచారం. ఆ స్క్రిప్టునే కొద్దిగా మార్చి బన్నీ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా మార్చారని వినపడుతోంది. అయితే కొందరు కృష్ణం వందే జగద్గురం స్క్రిప్టు ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ లో పరిశీలనలో ఉందని,అది వేరు ఇది వేరుని అంటున్నారు.

ఇక ఈ వేదం చిత్రంలో బన్నీతో పాటు మంచు మనోజ్ నటించనున్నారు. అనూష్క మరో లీడ్ రోల్ లో కన్పించనుంది. యువతకు సందేశమిస్తూ ఎంటర్టైన్ మెంట్ తో సాగే విధంగా ఉంటుందని స్క్రిప్టు రూపొందించారని సమాచారం. జూన్ ఏడున ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఆర్కా బ్యానర్ పై దేవినేని ప్రసాద్,శోభు యార్లగడ్డ నిర్మించనున్నారని తెలుస్తోంది.

అక ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సారధ్యంలో మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సీతారామశాస్త్రి,ఇ.యస్.మూర్తి పాటలు రాస్తున్న ఈ చిత్రానికి జనశేఖర్ (హౌస్ ఫుల్ ఫేమ్)కెమెరామెన్ గా పనిచేయనున్నారు. గమ్యం చిత్రం లాగే ఈ వేదం కూడా సంచలనం సృష్టిస్తుందని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X