వినాయక్ సేఫ్ గేమ్: ‘అల్లుడు శీను’ టాక్...?
హైదరాబాద్: పూర్తిగా కొత్త హీరోతో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా పరీక్ష లాంటిదే. నిర్మాత కొడుకు అనే ట్యాగ్ తప్ప ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఖర్చుకు వెనకాడొద్దు... తొలి సినిమా తన కొడుకు ఇండస్ట్రీలో పాతుకు పోయేలా ఉండాలని నిర్మాత ఆరాటం. వెరసి 'అల్లుడు శీను' చిత్రం విషయంలో దర్శకుడు వివి వినాయక్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడాడు.
కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన అన్ని మసాలాలు వేసి.....'అల్లుడు శీను' సినిమాను తన మార్కు ఉండేలా రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించారు. సమంత హీరోయిన్, తమన్నా ఐటం సాంగ్, బ్రహ్మానందం కామెడీ సీన్లతో ఎంటర్టెన్మెంటుకు లోటు లేకుండా చూసుకున్నాడు.

బాక్సాఫీసు నుండి అందుతున్న రిపోర్ట్ ప్రకారం....సినిమా చూసిన వారు ఈ చిత్రం రెగ్యులర్ వినాయక్ మార్కు సినిమాలా ఉందని...కొత్తదనం లేదని, రొటీన్ స్టోరీ ఉందని అంటున్నారు. కొత్త హీరో అయినా శ్రీనివాస్ డాన్సులు, ఫైట్లు బాగా చేసాడని, సమంత గ్లామర్ రోల్, తమన్నా ఐటం సాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు.
బ్రహ్మానందం కామెడీ, దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ 'అల్లుడు శీను' చిత్రానికి మరింత వన్నె తెచ్చాయంటున్నారు. రెగ్యులర్ ఎంటర్టెన్మెంట్ అంశాలే తప్ప గొప్పగా చెప్పుకోవడానికి సిమాలో ఏమీ లేదని, యావరేజ్ అంటూ తేల్చేస్తున్నారు. ఫస్ట్ డే టాక్ పరంగా సినిమా సేఫ్ జోన్లో ఉందని స్పష్టం అవుతుంది.


Click it and Unblock the Notifications











