సమంత న్యూ మూవీ ‘అల్లుడు శీను’ విడుదల జులై 25న
హైదరాబాద్: సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టెనర్ 'అల్లుడు శ్రీను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలై శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాట్లాడుతూ 'ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో రూపొందించిన మరో సూపర్ హిట్ ఆడియో 'అల్లుడు శీను'. ఈ ఆడియో విడుదలైన రోజు నుండే సేల్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఆల్బమ్ లోని అన్ని పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంత మంచి ఆడియో చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాము' అన్నారు.

బెల్లంకొండ
చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘ఆడియోకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంత మంచి ఆడియోను అందించిన దేవిశ్రీ ప్రసాద్ కి థాంక్స్ అన్నారు.

రిలీజ్ డేట్
ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నామని బెల్లంకొండ సురేష్ తెలిపారు.

నటీనటులు
బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రదీప్, రఘుబాబు, వేణు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, రవి బాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, స్టంట్ శివ, రవి వర్మ, వెంకట్, డాన్స్: రాజసుందరం, ప్రేమ్ రక్షిత్, గణేష్, శేఖర్, కథ: కె.యస్.రవీంద్రనాథ్(బాబీ), కోన వెంకట్, డైలాగ్స్: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు, కో డైరెక్టర్స్: పుల్లారావు, సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











