అల్లుడు శ్రీను కోసం టఫ్ కాంపిటీషన్
హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన 'అల్లుడు శీను' చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టడంతో ఈ చిత్రంపై ఇతర ఇండస్ట్రీల కన్ను పడింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ దక్కించుకునేందుకు అటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో పాటు, ఇటు తమిళ ఫిల్మ్ మేకర్స్ కూడా పోటీ పడుతున్నారట.
కొడుకు హీరోగా పరిచయం అయ్యే చిత్రం కావడంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీగానే ఖర్చు పెట్టారు. విడుదల తర్వాత చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించడం, ఇపుడు రీమేక్ రైట్స్ కూడా డిమాండ్ పెరగడంతో చాలా సంతోషంగా ఉన్నారట బెల్లంకొండ. పరిస్థితి చూస్తుంటే పెట్టినపెట్టుబడి మొత్తం తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది.

కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన అన్ని మసాలాలు వేసి.....'అల్లుడు శీను' సినిమాను తన మార్కు ఉండేలా రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు వినాయక్. సమంత హీరోయిన్, తమన్నా ఐటం సాంగ్, బ్రహ్మానందం కామెడీ సీన్లతో ఎంటర్టెన్మెంటుకు లోటు లేకుండా చూసుకున్నాడు.
పూర్తిగా కొత్త హీరోతో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా పరీక్ష లాంటిదే. నిర్మాత కొడుకు అనే ట్యాగ్ తప్ప ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఖర్చుకు వెనకాడొద్దు... తొలి సినిమా తన కొడుకు ఇండస్ట్రీలో పాతుకు పోయేలా ఉండాలని నిర్మాత ఆరాటం. వెరసి 'అల్లుడు శీను' చిత్రం విషయంలో దర్శకుడు వివి వినాయక్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడాడు.


Click it and Unblock the Notifications











