»   » సమంతను నలిపేసాడట:‘అల్లు శీను’ ఆడియో (ఫోటోస్)

సమంతను నలిపేసాడట:‘అల్లు శీను’ ఆడియో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'అల్లుడు శీను'. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకపై బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు గణేష్ నిర్మిస్తున్నారు.

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే కాన్సెప్టును ఫాలో అవుతున్న సురేష్ బాబు....కొడుకు తొలి చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా...తమన్నా ఐటమ్ పాట చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది.

ఆడియో వేడుకకు వెంకటేష్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దిల్ రాజు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఆడియో వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

వెంకటేష్ మాట్లాడుతూ...

వెంకటేష్ మాట్లాడుతూ...

''బెల్లంకొండ సురేష్ తన తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తొలి సినిమానే వినాయక్ దర్శకత్వంలో నటించడం సాయి శ్రీనివాస్ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సమంతను నలిపేసాడంటూ బ్రహ్మానందం..

సమంతను నలిపేసాడంటూ బ్రహ్మానందం..

'ఈ వేడుక అల్లుడు శీను ఆడియో ఫంక్షన్ లా లేదు. 100డేస్ వేడుకలా ఉంది. సాయిశ్రీనివాస్ డ్యాన్స్, ఫైట్స్ ఇరగదీసాడు, యాక్టింగ్ నరికేసాడు, సమంతను నలిపేసాడు. సమంత మంచి ఆర్టిస్ట్. సమంత, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ల మధ్య సాయి శ్రీనివాస్ బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు. ఈ సినిమాలో నా కామెడీ రెట్టింపు ఉంటుంది అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ

వి.వి.వినాయక్ మాట్లాడుతూ

''నా ఫస్ట్ సినిమా సక్సెస్ ని చూసి మా నాన్నగారు చాలా ఆనందపడ్డారు. రేపు ఈ సినిమా విడుదలైన తర్వాత తన కొడుకు విజయం చూసి కూడా బెల్లంకొండ సురేష్ గారు అంతే ఆనందపడతారు. సాయి శ్రీనివాస్ డ్యాన్స్ లు, ఫైట్లు బాగా చేసాడని అందరూ చెబుతున్నారు. ఓ డైరెక్టర్ గా సెంటిమెంట్ సీన్స్ బాగా చేయాలనుకున్నాను. సాయి శ్రీనివాస్ ఆ సీన్స్ చాలా బాగా చేసాడు. ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ చక్కటి పాటలిచ్చారు. కొత్త హీరో అయినా సమంత హీరోయిన్ గా నటించింది. అడగగానే ఈ చిత్రంలో ఓ పాట చేసిన తమన్నాకి కృతజ్ఞతలు అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ...

రాజమౌళి మాట్లాడుతూ...


వివి వినాయక్ చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. ఫస్ట్ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారి బుణం తీర్చుకోవడానికి వాళ్ల అబ్బాయిని లాంఛ్ చేసాడు. ఏ విషయంలోనూ రాజీపడకుండా భారీగా సినిమా తీసారు. సాయి శ్రీనివాస్ చాలా లక్కీ పర్సన్. పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...


వివి వినాయక్ దర్శకత్వంలో చేయడం శ్రీనివాస్ అదృష్టం. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. శ్రీనివాస్ డాన్స్ ఇరగదీసాడు. సినిమా వినోదాత్మకంగా ఉంటుంది అన్నారు.

సమంత మాట్లాడుతూ...

సమంత మాట్లాడుతూ...


''దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. ఆ పాటలకు చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసాను. చాలామంది సీనియర్స్ తో కలిసి ఈ సినిమాలో నటించాను. సాయి శ్రీనివాస్ ని మొదటి రోజు యాక్ట్ చేసినప్పుడే ఇతను మాములోడు కాదనిపించింది. చాలా బాగా నటించాడు. ఇప్పుడు హీరో అయ్యాడు. ఈ సినిమా తర్వాత తను స్టార్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ


నేను వి.వి.వినాయక్ ని చిత్ర పరిశ్రమకు డైరెక్టర్ గా పరిచయం చేసాను. ఇప్పుడు తను నా తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితమే మీ అబ్బాయి తొలి సినిమాకి నేను దర్శకత్వం వహిస్తాను అని వి.వి.వినాయక్ చెప్పారు. అతను చెప్పినట్టే ఆ బాధ్యతను తీసుకున్నారు. వినాయక్ గారికి మా కుటుంబమంతా బుణపడి ఉంటుంది అన్నారు.

తారాగణం

తారాగణం


ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, వేణు, రవిబాబు, వెన్నెల కిషోర్, ఫిష్ వెంకట్, ఫణి, జెన్నీ, రవిబాబు తదితరులు నటిస్తున్నారు.

తెరవెనక...

తెరవెనక...


ఈ చిత్రానికి సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ - గౌతంరాజు, ఆర్ట్ - ఎ.యస్.ప్రకాష్, లిరిక్స్ - చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, స్టంట్ శివ, రవివర్మ, వెంకట్, స్టోరీ - కె.యస్.రవీంద్రనాధ్ (బాబి), కోన వెంకట్, రచన - గోపీ మోహన్, డైలాగ్స్ - కోన వెంకట్, సినిమాటోగ్రఫీ - ఛోటా.కె.నాయుడు, నిర్మాత - బెల్లంకొండ గణేష్ బాబు, సమర్పణ - బెల్లంకొండ సురేష్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వి.వి.వినాయక్.

English summary

 Alludu Sreenu Audio Launch at Shilpa Kala Vedika in Hyderabad. Bellamkonda Sai Srinivas, Samantha, Praneetha, Venkatesh, Brahmanandam and Rajamouli graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu