కలబంద జ్యూస్, బాడీలోకి రసాయనాలు: పాపం డ్రగ్స్ తారల తంటాలు
డ్రగ్స్ కేసు లో విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల్లో కొందరు కలబంద రసం తాగుతూంటే. మరికొందరు ‘డిటాక్సిఫికేషన్’ చేయించుకొని వస్తున్నారట.
డ్రగ్స్ అవశేషాలు దొరక్కుండా ఉండేందుకు వారంతా వివిధ పద్ధతులు అనుసరిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల్లో కొందరు కలబంద రసం (అలోవీరా జ్యూస్) తాగుతున్నారు. మరికొందరు 'డిటాక్సిఫికేషన్' చేయించుకొని వస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు శుద్ధి అవుతాయని.. నమూనాలు సేకరించినా డ్రగ్స్ అవశేషాలు బయటపడవని అనుమానితులు ధీమాగా ఉన్నారు.

డ్రగ్స్ కేసు విచారణలో
మరింత లోతుగా విచారణ చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్లను కూడ తెప్పించి పరీక్షలు నిర్వహించాలనే యోచనలో అధికారులున్నారు. ఢిల్లీ నుండి ఈ మిషన్లను తెప్పించి పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారు.
Recommended Video


ఈ డోపింగ్ మిషన్ల ద్వారా
పరీక్షలు నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే ఈ మిషన్లను ఎప్పటివరకు తీసుకువస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తీసుకు వచ్చినా ఇప్పటికే రక్త నమూనాలు ఇవ్వటానికి కొందరు నిరాకరించటం తో వారి విషయం లో ఈ మిషన్లతో కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండబోదు.

రక్త నమూనాల్లో
డ్రగ్స్ అనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు అనుమానితులు ‘చిలేషన్' అనే ఒక ప్రక్రియను కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ ప్రక్రియలో సెలైన్ బాటిళ్ల ద్వారా రసాయనాన్ని బాడీలోకి ఎక్కిస్తారని, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని అంటున్నారు.

కలబంద రసం
తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో అలోవీరా జ్యూస్ దొరుకుతోంది. దీనిలో సహజంగా ఉండే చేదు గుణం పోవడానికి స్ట్రాబెర్నీ, యాపిల్ వంటి ఫ్లేవర్లను కలుపుతున్నారు. ఇలాంటి జ్యూస్‌లను ఏ ఇబ్బంది లేకుండా తాగేస్తున్నారు.

మొత్తానికి
ఏదో రకంగా ఈ ఆరోపణలని తప్పించుకోవటానికి నానా పాట్లూ పడుతున్నారట విచారణకు వచ్చే తారలు. ఇప్పటికైతే ఇది బయట వినిపించే టాక్ మాత్రమే అయినా ఇదులో నిజం కూడా లేకపోలేదు. అయినా అప్పుడు అవి తీస్కోవటం ఎందుకూ ఇప్పుడు ఇంత భాదగా ఇది తాగటం ఎందుకూ....


Click it and Unblock the Notifications











