రేప్ ఆరోపణలు: ఒక్క రూపాయి పరువు నష్టం దావా వేసిన ప్రముఖ నటుడు!
బాలీవుడ్ యాక్టర్ అలోక్ నాథ్... తనపై రేప్ ఆరోపణలు చేసిన రచయిత-దర్శకురాలు వింటా నందపై పరువు నష్టం దావే వేశారు. అయితే ఆయన కేవలం ఒక్క రూపాయికి దావా వేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఓ వైపు మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను వింటా నంద రూ. 1 చెల్లించి క్షమాపణలు చెప్పాలని కోరుతూ అలోక్ నాథ్ సివిల్ సూట్ దాఖలు చేశారు. 19 ఏళ్ల క్రితం అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడంటూ #మీటూ ఉద్యమంలో భాగంగా వింటా నందా ఫేస్ బుక్ పేజీ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

వింటా నందా ఆరోపణలపై అలోక్
వింటా నందా ఆరోపణలపై అలోక్ నాథ్ స్పందిస్తూ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చు. కానీ నేను కాదు వేరొకరు ఆమెను రేప్ చేసి ఉండవచ్చు అని ఆయన మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు.

సంస్కారీ ఇమేజ్ డ్యామేజ్
అలోక్ నాథ్ హిందీ టీవీ కార్యక్రమాల్లో పాపులర్ యాక్టర్. పలు చిత్రాల్లోనూ ఆయన నటించారు. సంస్కార వంతుడనే ఒక మంచి పేరు ఇంతకాలం ఆయనపై ఉంది. అయితే ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అయింది.

ఇన్నేళ్ల తర్వాత బయటకు
అలోక్ నాత్ తాగుబోతు, మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించే మనస్తత్వం ఉన్నవాడు అని ఆరోపించిన వింటా నంద తనపై అత్యాచారం జరిగిన తర్వాత ఈ విషయం నా స్నేహితులతో చెబితే... ఆయన చాలా పేరున్న వ్యక్తి, అతడితో పెట్టుకుంటే నీ కెరీర్ నాశనం అవుతుందని భయపెట్టారని, ఇన్నాళ్లకు #మీటూ ఉద్యమంలో భాగంగా అతడికి నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం వచ్చిందని తెలిపారు.

న్యాయ పరంగా ముందుకు
అలోక్ నాథ్ వేసిన పరువు నష్టం దావాపౌై న్యాయం పరంగా ముందుకు వెళ్లనున్నట్లు వింటా నంద లాయర్ ధృతి కపాడియా వెల్లడించారు. కాగా... అలోక్ నాత్ మీద ఇద్దరు నటీమణులు కూడా ఆరోపణలు చేయడంతో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలోక్‌నాథ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











