భయం భయం: బిపాసా బసు శృంగార చేష్టలు (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ ముదురు బ్యూటీ బిపాసా బసు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో ఆమె స్థానం ప్రత్యేకం. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటికీ గ్లామర్ రోల్స్ చేస్తూ రాణిస్తుందంటే అమ్మడు అందానికి ఉన్న ఆకర్షణ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి
మైమరిపించే పెర్ఫార్మెన్స్ తో పాటు....బికినీలు వేయడం దగ్గర నుండి ముద్దు సీన్ల వరకు ప్రేక్షకుడికి మత్తెక్కించే అనుభూతి కలిగించడం ఆమె స్టైల్. బిపాసా బసు త్వరలో ‘ఎలోన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెక్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన కెరీర్లో అత్యంత శృంగార భరితంగా, బోల్డ్ గా చేసిన సినిమా ఇదే అని బిపాసా బసు స్వయంగా చెప్పడం గమనార్హం.
ఈ చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. బిపాస బసుకు జోడీగా కరణ్ సింగ్ గ్రోవర్ నటిస్తున్నాడు. జాకీర్ హుస్సేన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం భయం రేకెత్తించడంతో పాటు బిపాసా బసు శృంగార చేష్టలతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ముద్దు సీన్లు
ఎలోన్ చిత్రంలో బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు చిత్రీకరించారు.

కరణ్ సింగ్ గ్రోవర్
హిందీ టీవీ సీరియల్ నటుడు అయిన కరణ్ సింగ్ గ్రోవర్ ‘ఎలోన్' చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

భూషణ్ పటేల్
గతంలో భూషణ్ పటేల్ 1920:ఈవిల్ రిటర్న్స్, రాగిని ఎంఎంఎస్-2 లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి.

శృంగార సన్నివేశాలు
సినిమాలో హరర్ సీన్లతో పాటు శృంగార సన్నివేశాలకు పెద్ద పీఠ వేసారు.

రొమాంటిక్ సాంగ్స్
సముద్రం ఒడ్డున చిత్రీకరించిన రొమాంటిక్ సాంగులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

ఆకట్టుకుంటున్న పోస్టర్స్...
ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్స్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటున్నాయి. సినిమా సెక్స్ అండ్ హారర్ మిక్స్ అని చెప్పకనే చెబుతున్నాయి.

అంచనాలు...
‘ఎలోన్' తన తొలి చిత్రం కావడంతో కరణ్ సింగ్ గ్రోవర్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

బిపాసా
ఈ మధ్య కాలంలో బిపాసా బసుకు సరైన పెద్ద హిట్టు అంటే ఏమీ లేదు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తోంది.

పనోరమ
పనోరమ స్టూడియోస్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుమార్ మంగత్, అభిషేక్ పాథక్, ప్రదీప్ అగర్వాల్, ప్రశాంత్ శర్మ నిర్మాతలు.

విడుదల
ఈ చిత్రాన్ని జనవరి 16, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











