ఇద్దరు కుర్ర బ్యూటీలతో మహేష్ రొమాన్స్.. రష్మికకు గోల్డెన్ ఆఫర్!
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించేశారు. దీనితో మహేష్ తదుపరి చిత్రాలపై కసరత్తులు మొదలైపోయాయి. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఎఫ్2తో మ్యాజిక్
అనిల్ రావిపూడి టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరిగా మారిపోయారు. ఎంటర్టైన్మెంట్ కథలతో మ్యాజిక్ చేయడంలో ఈ దర్శకుడు దిట్ట. పటాస్ మొదలుకుని ఇటీవల విడుదలైన ఎఫ్ 2 చిత్రం వరకు అన్నీ విజయాలే. ఎఫ్2 చిత్రం 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనితో మహేష్ ని డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం అనిల్ రావిపూడి దక్కింది. ఈ వేసవి తర్వాత మహేష్, అనిల్ రావిపూడి చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కుర్ర బ్యూటీలతో రొమాన్స్
మహేష్ బాబు సినిమా కోసం అనిల్ రావిపూడి అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో కుర్ర హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. మరో హీరోయినిగా కన్నడ హీరోయిన్ రష్మిక మందనని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం గీత గోవిందం చిత్రంతో యువతని మాయ చేసింది. చాలా మంది కుర్రాళ్ళు రశ్మికకు అభిమానులుగా మారిపోయారు.

గోల్డెన్ ఆఫర్
సాయి పల్లవి ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతోంది. ఈ తరుణంలో మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ రావడం ఈ అమ్మడికి గోల్డెన్ ఆఫరే అని చెప్పొచ్చు. ప్రస్తుతం రష్మిక తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే నితిన్ కొత్త చిత్రం భీష్మలో కూడా రశ్మికనే హీరోయిన్.

తమిళంలో
ఇటీవల రష్మిక తమిళంలో తొలి అవకాశం అందుకుంది. త్వరలో కార్తీ సరసన నటించబోతోంది. మహేష్, అనిల్ రావిపూడి చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహర్షి చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. వేసవి కానుకగా మే 9న మహర్షి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











