లవర్ సూసైడ్‌పై మౌనం వీడిన ఐటం బాంబు

By Bojja Kumar

ఐటం బాంబుగా, నటిగా దక్షిణాది సినిమాల్లో రాణించిన ఆల్ఫాన్సా తన ప్రియుడు వినోద్ సూసైడ్ నేపథ్యంలో సంవత్సర కాలంగా తెరకు దూరమైన సంగతి తెలిసిందే. వినోద్ కుటుంబ సభ్యలు ఆమెపై హత్య ఆరోపణలు చేయడమే కాదు, ఆవిడే డబ్బుకోసం వినోద్‌ను హత్య చేసిందంటూ కోర్టు కెక్కారు. ఈ నేపథ్యంలో ఆల్ఫాన్సా ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడంతో ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశం అయింది.

అయితే కోర్టు ఆమెకు అనుకూలమైన సంకేతాలు ఇవ్వడంతో ఆల్ఫాన్సా ఎట్టకేలకు మౌనం వీడింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ...వినోద్ నేను కలిసి సహజీవనం చేసిన మాట వాస్తవమే. మేము రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా కలసి జీవించాము. కానీ అతని మరణంతో సంబంధం లేదు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర కారణాలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ వాళ్ల కుటుంబ సభ్యులు నాపై అనవసర అభాండాలు వేసి కోర్టుకీడ్చారు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఈ వ్యవహారం వల్ల చాలా కృంగిపోయాను. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి నుంచి బయట పడుతున్నాను, త్వరలోనే మళ్లీ సినీ జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాను అని వెల్లడించింది.

భర్త నోబాల్‌తో విడిపోయిన ఆల్ఫాన్సా కొంతకాలంగా కూతురుతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య స్నేహితుడైన వినోద్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి ఆల్ఫాన్సా, వినోద్ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని వినోద్ ప్రపోజ్ చేశాడని, అయితే అప్పటికే తాను ఒక బిడ్డకు తల్లయినందున పెళ్లి ప్రపోజల్‌ను ఆల్ఫాన్సా తిరస్కరించిందని, ఈ క్రమంలో ఒక రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఉద్వేగానికి గురైన వినోద్ ఆత్మ హత్య చేసుకున్నాడని కొందరంటున్నారు.

ఆ మధ్య ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లినప్పుడు పిటిషన్‌లో వినోద్‌కుమార్ మృతి తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ఫాన్సా స్పష్టం చేశారు. ఏ పాపం ఎరుగని తనను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్న దృష్ట్యా ముందస్తు బెయిల్ మం జూరు చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కలైయరసన్ విచారించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X