అరెస్టు భయంతో ఐటం గర్ల్ ఎస్కేప్!
ఐటం గర్ల్, నటి ఆల్ఫాన్సా సడన్‌గా చెన్నయ్ పోలీసులకు దొరకకుండా ఎస్కేప్ అయింది. ఆమె హైదరాబాద్ లోని ఓ రహస్యం ప్రాంతంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆమె ప్రియుడు వినోద్ ఇటీవల ఆమె నివాసంలో అనుమానాస్పదంగా మరణించడం, ఈ క్రమంలో ఆల్పాన్సా ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. వినోద్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనిది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విచారణ నిమిత్తం తనను అరెస్టు చేస్తారనే భయంతో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఆల్ఫాన్సా....బెయిల్ దొరకక పోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిందని చెన్నయ్ సినీ వర్గాల సమాచారం.
అసలు ఏం జరిగిందంటే...
భర్త నోబాల్‌తో విడిపోయిన ఆల్ఫాన్సా కొంతకాలంగా కూతురుతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య స్నేహితుడైన వినోద్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి ఆల్ఫాన్సా, వినోద్ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని వినోద్ ప్రపోజ్ చేశాడని, అయితే అప్పటికే తాను ఒక బిడ్డకు తల్లయినందున పెళ్లి ప్రపోజల్‌ను ఆల్ఫాన్సా తిరస్కరించిందని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉద్వేగానికి గురైన వినోద్ ఆల్ఫాన్సా సారీతో ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆల్ఫాన్సా తరుపు వాళ్ల వాదన. అయితే వినోద్ బంధువులు...వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆల్పాన్సానే అతన్ని చంపిందని ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











