తక్కువే: యాంకర్ అనసూయ ఐస్ బకెట్ చాలెంజ్ (వీడియో)

By Bojja Kumar

ALS Ice Bucket Challenge - Anchor Anasuya
హైదరాబాద్: మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ హాలివుడ్ నటులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, టాలీవుడ్ యాక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరూ 'ఏఎల్ ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్' లో పాల్గొంటున్నారు. వరల్డ్ వైడ్ ఈ ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్ ఇపుడు క్రేజీగా సాగుతోంది. ఓ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/CxZ4BKKx-jE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇటీవల తెలుగు సెలబ్రిటీలు మంచు లక్ష్మి, కలర్స్ స్వాతి, నిఖిల్ లాంటి ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. అందరిలా తాను ఎక్కువ నీళ్లు వేస్టు చేయనని, తక్కువ నీళ్లతోనే కానిచ్చేస్తాను అంటూ.... ఐస్ వాటర్ మీద పోసుకుంది. తన స్నేహితుల ద్వారా చాలెంజ్ స్వీకరించానని, ప్రతి ఒక్కరికి తాను నామినేట్ చేస్తున్నానని అనసూయ పేర్కొంది.

ఐస్ బకెట్ చాలెంజ్ అంటే ఏమిటి? జాన్ ఫ్రేట్స్ అనే వ్యక్తి ఈ సరికొత్త కాన్సెప్టుకు తెరతీశాడు.. ఆయన 29 ఏళ్ల కుమారుడు పీటర్ కు అమీయో ట్రాఫిక్ లాటరల్ సెరోసిస్ ఏ ఎల్ ఎస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ సంస్థకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చేశాడు...అక్కడ నుండి మొదలయిన ఐస్ బకెట్ చాలెంజ్ అంతటా విస్తరించింది. ఈ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించిన ఒక్కొక్కరు మరో ముగ్గురిని సవాల్ చేస్తుండటంతో వేగంగా విస్తరించింది. సోషల్ మీడియా ద్వారా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. విరాళాలు కూడా బాగా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X