'ఐస్ బకెట్ ఛాలెంజ్' లో కలర్స్ స్వాతి (వీడియో)
హైదరాబాద్ : 'ఐస్ బకెట్ ఛాలెంజ్' తో టాలివుడ్ కూడా మునిగి తేలటానికి సిద్దమవుతోంది. నిన్న హన్సిక హల్‌చల్ చేస్తే ఇప్పుడు ఆ జాబితాలో మరెందరో ప్రముఖులు చేరిపోయారు. సానియామీర్జా, అభిషేక్‌బచ్చన్‌తో పాటు మరెందరో ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. అదే క్రమంలో కలర్స్ స్వాతి, నిఖిల్ కూడా పాల్గొన్నారు వారి వీడియోని వీక్షించండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/voPyNrOGUJs" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక నిఖిల్, కలర్స్ స్వాతి ఈ ఛాలెంజ్ వీడియో లో భాగంగా తమ లేటెస్ట్ చిత్రం కార్తికేయ ప్రమోషన్ కూడా పెట్టేసుకున్నారు. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర హీరో 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, నాజర్, రావు రమేష్, ప్రవీణ్, తులసి, కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు, శివన్నారాయణ, మీనాకుమారి, చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు, వేణుగోపాలరావు, ఐ కె. త్రినాధ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ: రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కధ - మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.


Click it and Unblock the Notifications











