For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరికీ నచ్చే చిత్రం ఐపీసీ సెక్షన్ భార్యాబంధు.. నిర్మాత ఆలూరి సాంబశివరావు

By Rajababu
|

నిర్మాత ఆలూరి సాంబశివరావు మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. స్థిరాస్తి రంగంలో ప్రవేశించి అందులో రాణించారు. నాలుగేళ్ల క్రితం ఆలూరి క్రియేషన్స్ బ్యానర్ పై 'చెంబు చినసత్యం' చిత్రంతో నిర్మాతగా ఆలూరి సాంబశివరావు మారారు. తాజాగా 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' చిత్రాన్ని నిర్మించారు.

ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో.. శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా.. శ్రీనివాస్ రెట్టాడి దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' ఈనెల (జూన్) 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. చిత్ర నిర్మాత, ఆలూరి క్రియేషన్స్ అధినేత ఆలూరి సాంబశివరావు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

"నిర్మాతగా నా తొలి చిత్రం 'చెంబు చినసత్యం' నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్ధికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. 'నేనే ముఖ్య మంత్రి' అనే సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.

Aluri Samba Siva Rao: everyone loves IPC section movie

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' విషయానికి వస్తే.. మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఓ సెక్షన్ ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు అనే అంశాన్ని తీసుకొని దానికి పుష్కలమైన వినోదాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఆలోచింపజేస్తూనే వినోదాన్ని పంచుతుంది.

కథను డ్రైవ్ చేసే ఒక మంచి పాత్రలో ఆమని నటించారు. ఈ చిత్ర ద్వారా హీరోగా పరిచయమవుతున్న శరత్ చంద్రకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. హీరోయిన్ నేహా దేశ్ పాండే, మధునందన్, వాసు ఇంటూరి, రాగిణి తదితరుల పాత్రలు కూడా అందరినీ అలరిస్తాయి. విజయ్ కూరాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం, పింజర్ల శ్యాం ఛాయాగ్రహణం 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన మా దర్శకుడు రెట్టాడి శ్రీనివాస్ ప్రతి సన్నివేశాన్ని జనరంజకంగా మలిచాడు.

ఈనెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. అదే రోజు మరో ఏడెనిమిది సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే మా సినిమాపై మాకు నమ్మకముంది. మొదటి రోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు మా సినిమాకి బ్రాండ్ అంబాసడర్ గా మారి మా సినిమా చూడమని ప్రతి ఒక్కరికీ చెబుతారు. ఈ మౌత్ టాక్ ఇలాగే స్ప్రెడ్ అయి.. 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా బ్యానర్ లో రూపొందుతున్న 'నేనే ముఖ్యమంత్రి' చిత్రాన్ని కూడా రెండు మూడు నెలల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం!!

English summary
Rettadi Srinivas’s upcoming film ‘IPC Section Bharya Bandhu’ has finally released its official trailer. While the film stars Sarraschandra and Neha Deshpande in lead roles, actress Amani also stars in a crucial role. This movie is produced by Aluri Samba Siva Rao. This movie is set to release on June 29th.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more