పవన్ న్యాయ పోరాటం: అందుకే రాలేక పోతున్నాను అంటూ నితిన్ ట్వీట్!

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిలి ఛాంబర్ వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండాల్సింది, కానీ పలు కారణాల వల్ల ఈ న్యాయ పోరాటంలో తాను పాల్గొనలేకపోతున్నాను అంటూ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా తాను పవన్ కళ్యాణ్ అభిమానినే, ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని నితిన్ వెల్లడించారు.

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

ట్వీట్ చేసిన నితిన్

నితిన్ ప్రస్తుతం స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న శ్రీనివాస క‌ళ్యాణం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగులో భాగంగా ఆయన చండీఘ‌ర్ వెళ్లారు. అత్యంత కీలకమైన సమయంలో తాను ఇక్కడ లేక పోయానే అనే బాధ నితిన్ ట్వీట్లో కనిపించింది.

నితిన్ మనసంతా ఇక్కడే

నితిన్ మనసంతా ఇక్కడే

నితిన్‌, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. ఈ చిత్రానికి సంబందించిన రెండో షెడ్యూల్ ప్రస్తుతం చండీఘ‌ర్ లో జరుగుతోంది. తాను షూటింగుకు వెళ్లపోతే నష్టం ఏర్పడే అవకాశం ఉండటంతో నితిన్ అయిష్టంగానే షూటింగులో పాల్గొన్నారు. ఆయన మనసంతా హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతోంది.

పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న కుట్రపై ట్వీట్

పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న కుట్రపై కొన్ని రోజుల క్రితం నితిన్ ట్విట్టర్లో స్పందించారు. ‘ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోసిట్ రియాక్షన్... జస్ట్ వెయిట్ ఫర్ ఇట్...ఇట్ ఈజ్ కమింగ్ సూన్' అంటూ నితిన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ట్వీట్స్‌ను రీట్వీట్ చేసిన నితిన్

పవన్ కళ్యాణ్ ట్వీట్స్‌ను రీట్వీట్ చేసిన నితిన్

తనపై జరుగుతున్న కుట్రలు, తన తల్లిని తిట్టించి నీచానికి పాల్పడి వ్యక్తులు, వారి వెనక ఉన్న రాజకీయ, మీడియా శక్తులను పేర్లతో సహా బయట పెడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లను నితిన్ రీట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X