వరుసగా తగిలిన దెబ్బలు నాలో కసిని...ఐశ్వర్య రాయ్
వరుసగా తగిలిన దెబ్బలు నాలో కసిని పెంచాయి. అలాగే నంబర్‌వన్ అనే స్థానంపై ఇష్టాన్ని కూడా పెంచాయి అంటోంది ఐశ్వర్యారాయ్. ఆమెకు రీసెంట్ గా రోబో తప్ప ఏదీ విజయం సాధించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం గుజారిష్ లో నటనకు పేరు వచ్చినా ఫ్లాఫ్ తెచ్చింది. అలాగే మణిరత్నం రావణ్ కూడా ఆమెకు తీవ్రమన నిరాశని కలిగించింది. అయితే తానే నెంబర్ వన్ అంటోంది. అలాగే బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని ఎవరయినా అంటే...నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. నాకు ఇష్టమైన అంకె ఒకటి. ఏ రంగంలో ఉన్నా...నంబర్ వన్ గా ఉండటానికే ఇష్టపడతా. ఆ స్థానం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో నాకు ఎదురైన పరిస్థితులను తెలియజేయాలంటే...ఓ పుస్తకాన్ని రాయొచ్చు అంటోందామె.


Click it and Unblock the Notifications











