For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ‘హరిహర వీరమల్లు’పై అనుమానాలు: అందుకే ఆగిపోయిందన్న నిర్మాత.. అసలు మేటర్ రివీల్ చేసేశారుగా!

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే మరో రెండు చిత్రాలనూ మొదలు పెట్టేశాడు. అందులో క్రిష్ జాగర్లమూడి రూపొందించబోతున్న 'హరిహర వీరమల్లు' అనే సినిమా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా విడుదలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఈ భారీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  తొలిసారి అలాంటి సినిమాలో పవన్ కల్యాణ్

  తొలిసారి అలాంటి సినిమాలో పవన్ కల్యాణ్

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడితో ‘హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో తొలిసారి పిరియాడిక్‌ జోనర్‌లో నటిస్తున్నాడు పవన్.

  అప్పటి సెట్టింగ్‌లు.. సినిమా బడ్జెట్ ఎంతంటే

  అప్పటి సెట్టింగ్‌లు.. సినిమా బడ్జెట్ ఎంతంటే

  ‘హరిహర వీరమల్లు' మూవీ మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతోంది. దీని కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ. 180 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

  సినిమా కోసం సాహసాలు.. పవన్ దూకుడు

  సినిమా కోసం సాహసాలు.. పవన్ దూకుడు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీ కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, అతనకెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కోసం పవన్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట.

  టైటిల్ వీడియో విడుదల... భారీ స్పందనతో

  టైటిల్ వీడియో విడుదల... భారీ స్పందనతో

  వాస్తవానికి క్రిష్ జాగర్లమూడి - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు మొదట్లో ‘విరూపాక్ష' అనే టైటిల్ అనుకున్నారు. కానీ, దీనికి ‘హరిహర వీరమల్లు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మహా శివరాత్రి సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్‌కు ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

  పవన్ ‘హరిహర వీరమల్లు'పై అనుమానాలు

  పవన్ ‘హరిహర వీరమల్లు'పై అనుమానాలు

  ఇటీవలే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చినా కరోనా వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడంతో పాటు దాని ప్రభావం ఎక్కువగా ఉండడంతో షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో క్రిష్ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్‌పై అప్పుడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Filmibeat telugu
  అసలు మేటర్ రివీల్ చేసేసిన సినిమా నిర్మాత

  అసలు మేటర్ రివీల్ చేసేసిన సినిమా నిర్మాత

  నిన్నటితో ‘ఖుషీ' మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎమ్ రత్నం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ‘వీరమల్లు' రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘కరోనా వల్ల షూటింగ్ ఆపేశాం. త్వరలోనే ఇది మళ్లీ మొదలు పెడతాం. మాకు చాలా సమయం ఉంది కాబట్టి.. కచ్చితంగా దీన్ని సంక్రాంతికే విడుదల చేస్తాం. అందులో ఏ మార్పూ ఉండదు' అంటూ చెప్పుకొచ్చారు.

  English summary
  The Krish directorial, as being speculated for the last few months, has been titled Harihara Veeramallu, with the tagline ‘A legendary heroic outlaw’. True to the tagline, Pawan is showcased in a heroic avatar. The dagger, the spear and the intensity in Pawan’s eyes make a power-packed impact. Senior music composer MM Keeravani’s background score in the title reveal teaser...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X