17 ఏళ్ల ఖుషి.. పవన్ కళ్యాణ్‌ని కలసిన నిర్మాత.. చిరు నోట అలాంటి మాట, ఆశ్చర్యం!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి తిరుగులేని చిత్రం. టాలీవుడ్ లో ఖుషి తరువాత అనేక ప్రేమ కథలు, రొమాంటిక్ చిత్రాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఖుషి చిత్ర స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యకంగానే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ ఫామ్ లో ఉన్నరోజుల్లోనే ఖుషి చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భూమిక, పవన్ కళ్యాణ్ మధ్య సరదాగా సాగె సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ స్టయిల్, అలీతో కామెడీ సీన్స్ ఈ చిత్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. అప్పట్లో యువతని ఈ చిత్రం ఉర్రూతలూగించింది. ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం విడుదలై నేటికి 17 ఏళ్ళు పూర్తైన సందర్భంగా చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ ని కలుసుకుని చిత్ర అనుభవాలని గుర్తు చేసుకున్నారు.

 ఇండస్ట్రీ హిట్ కు 17 ఏళ్ళు

ఇండస్ట్రీ హిట్ కు 17 ఏళ్ళు

పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఖుషి చిత్రం విడుదలై నేటికీ 17 ఏళ్ళు పూర్తయింది. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేడిగా ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రొమాంటిక్ ప్రేమ కథలలో ఖుషి క్లాసిక్ అనదగ్గ చిత్రం. అప్పట్లో యువతకు ఈ చిత్రం కావలసినంత వినోదాన్ని పంచింది.

పవన్ కళ్యాణ్‌ని కలసిన నిర్మాత

పవన్ కళ్యాణ్‌ని కలసిన నిర్మాత

ఖుషి చిత్రం విడుదలై 17 ఏళ్ళు గడచిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని జనసేనపార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఆయన భారీ పుష్ప గుచ్చం అందజేశారు. ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించగా, తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, ఏ ఎం రత్నం ఏకాంతంగా ఖుషి చిత్ర అనుభవాలని నెమరు వేసుకున్నారు.

యూత్ ఐకాన్‌గా మారిన పవన్

యూత్ ఐకాన్‌గా మారిన పవన్

మెగాస్టార్ చిరంజీవి ఆ సమయంలో సూపర్ ఫామ్ లో ఉన్నారు. అన్న చాటు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఖుషి చిత్రం ట్రెండ్ సెట్ చేసిన మూవీ కావడం విశేషం.

చిరు నోట అలాంటి మాట

చిరు నోట అలాంటి మాట

ఖుషి చిత్రం విడులయ్యాక ఉమ్మడి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. తిరుగులేని స్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్న చిరంజీవి ఆ సదర్భంగాలో ఓ మాట అన్నారు. 'తమ్ముడి జోరు చూస్తుంటే.. ఇక నేను కూడా జాగ్రత్త పడాలి అనిపిస్తుంది'.. చిరు నోట అలాంటి మాట వచ్చిందంటే పవన్ జోరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇంద్ర విజయోత్సవ వేడుకలో

ఇంద్ర విజయోత్సవ వేడుకలో

ఖుషి చిత్రం 2001 లో విడుదలయింది. ఆ మరుసటి సంవత్సరమే మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ చిత్రం ఇంద్ర విడుదలయింది. ఇంద్ర విజయోత్సవ వేడుకని ఘనంగా నిర్వహించారు. జానీ చిత్ర షూటింగ్ వలన పవన్ కళ్యాణ్ ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే అభిమానుల హర్షద్వానాలతో మోత మోగించారు. అభిమానులు స్పందన చూసి చిరు ఆశ్చర్యపోవడం విశేషం.

ప్రయత్నిస్తున్న ఏఎం రత్నం

ప్రయత్నిస్తున్న ఏఎం రత్నం

ఖుషి చిత్రం తరువాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ తరువాత వీరి కలయికలో మరో చిత్రం రాలేదు. ఆ మధ్యన రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని ప్రారంభించారు కూడా. కానీ పవన్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయిపోవడం ఆ సినిమా ఆగిపోయింది. అయినా కూడా పవన్ తో మరో చిత్రం చేయడానికి రత్నం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బాగా బిజీ అయిన నేపథ్యంలో అది జరుగుతుందా అంటే డౌటే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X