twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ గురించి...

    By Srikanya
    |

    హైదరాబాద్ : నేను అఖిల్‌ను ఆస్ట్రేలియా పంపా . అఖిల్ చదువుకుంటూనే సినిమాల గురించి నేర్చుకుంటున్నాడు. ఆటల పట్ల ఎంతటి మక్కువ ఉందో, అంతే మక్కువ సినిమాలపైనా ఉంది. అతను సినిమాల్లోకి రావడానికి రెండు మూడేళ్లు ఆగాలి. చిన్నప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటానంటే నా తల్లిదండ్రులు ప్రఖ్యాత 'కళాక్షేత్ర'కు పంపారు. అక్కడే పదేళ్లు ఉండి, ఎంతో నేర్చుకున్నా అన్నారు అమల.

    అలాగే నాగచైతన్య సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు ఫిజికల్ కంఫర్ట్‌నెస్, బాడీ లాంగ్వేజ్ ముఖ్యమని చెప్పా. నా 'కళాక్షేత్ర' అనుభవాలు వివరించా. తను చక్కని నటన కనపరుస్తున్నాడు. అఖిల్ కంటే అతను ఎనిమిదేళ్లు పెద్దవాడు. కాబట్టి బాధ్యతాయుతమైన అన్నలాగే అఖిల్ పట్ల నడచుకుంటాడు. ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడు. అలాగే అన్నంటే అఖిల్‌కీ ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు.

    ఇక ఇరవై ఏళ్ల తర్వాత శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ఓ కీలక పాత్ర ద్వారా ఆమె మళ్లీ తెరమీదకు వస్తున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ... ఇరవై ఏళ్ల నుంచీ కెమెరా ముందు నటించలేదు కాబట్టి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సెట్స్ మీదకు తొలి రోజు వెళ్లినప్పుడు 'అంతా మర్చిపోయాను. ఇంకే నటిస్తాను' అనుకున్నాను. శేఖర్ నన్ను నటించవద్దనీ, ఆ పాత్రలాగా ప్రవర్తించమనీ చెప్పారు. తెలుగింటి మహళగా కనిపించాలన్నారు. పొడవాటి జడ ఉండాలని విగ్గు పెట్టారు. తొలి సన్నివేశం చేసేప్పుడు కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ సన్నివేశాన్ని నాకు కూతుళ్లుగా నటిస్తున్న ఇద్దరు ఆడపిల్లలతో చెయ్యాలి అన్నారు.

    ఈ సినిమాలో నాది చాలా చక్కని పాత్ర. నా కొడుకు అఖిల్ కాలేజ్ బాయ్ అయ్యాడు కాబట్టి నా చేత కాలేజ్ బాయ్ తల్లి పాత్రని చేయించాలని శేఖర్ అనుకున్నట్లుంది. నేను చేసింది మహిళలకు ప్రేరణనిచ్చే పాత్ర. ఉద్యోగిని అయిన వితంతువుగా నటించా. ఎలాంటి స్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. బయటకు మెతగ్గా కనిపించినా, అంతర్గతంగా బలమైన మహిళను. ఇందులో నేను ముగ్గురు పిల్లల తల్లిని. హీరో అభిజిత్‌తో పాటు ఇద్దరు ఆడపిల్లలు. ఈ సినిమా చూశాక 'ప్రతి మహిళా ఇలా ఉండగలగాలి' అనిపిస్తుంది ఎవరికైనా అని చెప్పుకొచ్చారు.

    English summary
    Nagarjuna's younger Son Akkineni Akhil is all set to debut as hero in Tollywood soon. Amala has confirmed the reports in a section of media about his film entry.Currently, Akhil is studying BBA in US and wants to complete his degree, just like his brother Naga Chaitanya, before stepping into films. He is also getting trained in acting and dances.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X