నాగార్జున ఉండగా ఆ పని కోసం వేరే వారెందుకు.. అమలా షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సినీ కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీది ప్రత్యేకం. ప్రేమకు, అనుబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ్.. వారి అన్యోన్య దాంపత్యం గురించి ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా శ్రీమతిని తీసుకెళ్లే నాగ్.. ఫారెన్‌ వెకేషన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్‌పై ఎంత ఎనర్జీగా ఉంటారో ఇంట్లోనూ అలానే ఉంటారని అమల పల్లు మార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది అమల.

 గుర్తుపట్టకపోవడంతో..

గుర్తుపట్టకపోవడంతో..

ఒకానొక సమయంలో నాగ్, అమల ఇద్దరూ ఫారెన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. నాగార్జున గుర్తు పట్టి పలకరించారని చెప్పుకొచ్చింది. అయితే పక్కనున్న తనను మాత్రం గుర్తు పట్టకపోవడంతో.. అమలా గారు ఎక్కడున్నారని సదరు అభిమాని అడిగాడట. అప్పుడు అమలా పూర్తిగా స్టైల్ మార్చడంతో ఎవ్వరూ గుర్తుపట్టలేదని పేర్కొంది.

ఫ్యామిలీతో వెకేషన్స్..

ఫ్యామిలీతో వెకేషన్స్..

అక్కినేని ఫ్యామిలీలో రెండు అందమైన జంటలుండా.. వారంతా కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు. ఇక అందరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అక్కినేని కోడళ్ల ఫోటోలు అయితే తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. మీడియాతో మాట్లాడే ప్రతీసారి వీరిద్దరూ తమ భర్తల గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతూనే ఉంటారు.

వంట గదికి దూరంగా..

వంట గదికి దూరంగా..

నాగ చైతన్య బాగా వంట చేస్తాడని, తనకు ఇంట్లో వంట గది ఎక్కడుందో కూడా తెలీదని ఎన్నో సార్లు సీక్రెట్స్ బయటకు చెప్పేసింది సమంత. తన భర్త వంట చేస్తుండగా.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు ఎంతగా హల్చల్ చేస్తుంటాయో అందరికీ తెలిసిందే.

Recommended Video

Akkineni Akhil Message To His Fans On His Birthday
నాగ్ ఉండగా వేరే వారెందుకు?

నాగ్ ఉండగా వేరే వారెందుకు?

తాజాగా అమల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత వంట చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. నాగార్జున లాంటి మంచి కుక్ ఉండగా వేరే వారు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసింది. అమల కూడా తన భర్త ఎంతో బాగా వంట చేస్తాడని ఎన్నో మార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X