మరో సినిమాకు సైన్ చేసిన అక్కినేని అమల

ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటి దీప్తి నావెల్, ఫరూక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అమల అక్కనేని దీప్తి వదిన పాత్రలో నటించబోతోంది. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో విడుదల కానుంది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉండి హౌస్ వైఫ్ గా, సోషల్ వర్కర్ గా బిజీ అయి పోయిన అమల మళ్లీ నటిగా తన మార్కు చాటడానికి సిద్ధం అవుతుండటం చర్చనీయాంశం అయింది.
అయితే అమల మాత్రం నటిగా బిజీగా గడపటం ఇష్టం లేదంటోంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నా కుటుంబానికి మరియు సమాజానికి నేను ఉపయోగపడటం మీదే నా దృష్టి అంతా ఉంటుంది ఇప్పుడు నేను ప్రత్యేకంగా కెరీర్ ఆరంభించాలని అనుకోవట్లేదు నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను ఎటువంటి పాత్ర కోసం ఎదురుచూడదలచుకోలేదు కాని మంచి పాత్రలు అది కూడా 7 రోజుల్లో పూర్తయ్యే పాత్రలు వస్తే తప్పకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తా' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











