నాగ్‌ను అలా చూడాలని ఎంతో ఆసక్తిగా ఉంది: అమల

ఆరు పదుల వయసులోనూ ఎంతో హ్యాండ్స‌మ్‌గా కనిపిస్తుంటారు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. అందంతో పాటు తనదైన శైలి నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నాగ్.. త్వరలోనే ప్రారంభం కానున్న తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3ని హోస్ట్‌ చేయనున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది నాగ్ హోస్టింగ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఆయన భార్య అక్కినేని అమల సైతం ఇదే తరహా ఆసక్తితో ఉన్నానని చెబుతున్నారు. బెంగాళీస్‌ ఇన్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ 'హైదరాబాద్‌ బెంగాళీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌' వివరాలను ఎర్రమంజిల్‌లోని హోటల్‌ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమల చివర్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' సీజన్- 3 హోస్టింగ్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Amala Akkineni Confident about Akkineni Nagarjuna Hosting

'బిగ్ బాస్' షో చూస్తుంటారా..? ఈ షో విషయంలో నాగార్జున గారికి ఏమైనా సలహాలు ఇస్తారా..? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ''ఇప్పటి వరకు నేను 'బిగ్ బాస్' అనే షో చూడలేదు. ఆ షో ఫార్మాట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ, ఈ సారి మాత్రం కచ్చితంగా చూస్తాను. నాగ్ ఈ షోను ఎలా హోస్ట్ చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉంది. ఈ తరహా రియాలిటీ షోలు ఆయనకు కొత్తే అయినా.. ఈజీగా చేసేస్తారనిపిస్తోంది. ఆయన కూడా ఈ షోపై నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు'' అని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే, సినిమాలు, టీవీ షోల విషయంలో సలహాల గురించి మాట్లాడుతూ.. ''ఆయన ఎలాంటి సినిమా ఒప్పుకున్నా.. దానికి సంబంధించిన చర్చలు మా మధ్య జరగవు. అలాగే, టీవీ కార్యక్రమాల విషయంలోనూ అంతే. కానీ, ఏదైనా సినిమా చూస్తే మాత్రం ఆయన కచ్చితంగా నా ఫీడ్ బ్యాక్ అడుగుతుంటారు. నేను నిజమైన ఫీడ్ బ్యాక్ ఇస్తానని ఆయన నమ్ముతుంటారు. అందుకే నేను కూడా నిజమైనదే చెబుతాను. ఇక, 'బిగ్ బాస్' చూసిన తర్వాత ఆయన ఎలా చేశారో చెబుతాను. మీలాగే నేను కూడా ఆయన అభిమానినే'' అని సమాధానమిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X