సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మి సినిమాలో అమల అక్కినేని!

By Bojja Kumar

ముంబై: నాగార్జునను పెళ్లాడిన తర్వాత అమల అక్కినేని దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంటూనే ఉంది. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తోంది. ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్' చిత్రంలో ఓ కీలకమైన పాత్ర పోషించిన ఆమె, అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లోనూ ఓ సీన్లో కనిపించారు. 2013లో హిందీలోనూ ఓ చిత్రంలో కనిపించారు.

తాజాగా అమల అక్కినేని మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో ఆమె స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ భట్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘టైమ్ లెస్ బ్యూటీ అమల అక్కినేని మేము తెరకెక్కిస్తున్న లవ్ సెగ ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నారు' అంటూ ట్వీట్ చేసారు.

Amala Akkineni to play a cameo in Humari Adhuri Kahani

‘హుమారి ఆధురి కహాని' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ భట్ నిర్మాత. కథ అందించింది కూడా ఆయనే. బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇమ్రాన్ హస్మి, విద్యాబాలన్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. మహేష్ భట్ తల్లిదండ్రుల లవ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

వచ్చే ఏడాది జూన్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమల అక్కినేని పాత్ర గోస్ట్ రోల్ అయినప్పటికీ కీలకంగా ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X