పన్ను మినిహాయింపు ఇవ్వాల్సిన సినిమా: అమల
హైదరాబాద్ : ఒకప్పటి హీరోయిన్, సిని నటుడు నాగార్జున భార్య అమల ఈ మధ్యన ఓ తమిళ చిత్రం చూసారు. శివం టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె అన్నారు. త్వరలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఆమె ప్రెవేట్ స్క్రీనింగ్ లో చూసారు. జంతు సంరక్షణ మీద తీసిన చిత్రం అదని, అందుకే చిత్రానికి తప్పకుండా పన్నుని మినహాయింపు ఇచ్చి అందరికీ చూపించాలని ఆమె అన్నారు. ఈ చిత్రాన్ని అమలాపాల్ భర్త దర్శకుడు విజయ్ రూపొందించారు.
అమల మాట్లాడుతూ..." ఇది ఓ అందమైన సినిమా. జంతువుల సంరక్షణ ఎంత అవసరమో చెప్పే సినిమా ఇది. మంచి మెసేజ్ ఉంది. భవిష్యత్ తరాలకు ఈ చిత్రం ఓ పాఠంగా ఉంటుంది. దర్శక,నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు,నటీనటులకు నా శుభాకాంక్షలు..మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ సినిమాకు తప్పని సరిగా టాక్స్ ఎంగ్జంప్షన్ ఇవ్వాలి ." అన్నారామె.

మానవీయ కోణం, వాస్తవిక చిత్రాలను తీయడంలో ఏఎల్ విజయ్ (అమలాపాల్ భర్త) కోలీవుడ్ తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 'దైవ తిరుమగల్', 'మదరాసపట్టిణం', 'కిరీడం' వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇటీవల తన శైలికి భిన్నంగా విజయ్‌తో 'తలైవా' తెరకెక్కించి పరాజయాన్ని చవిచూశారు. దీంతో మళ్లీ తన పాతమార్గంలోకే వచ్చారాయన. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు
ఇందులో 'దైవతిరుమగల్' ఫేం బేబీ సారా నటిస్తోంది. నాజర్ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. ఇటీవల 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన తెరపైకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











