Akhil Agent: ఓపెన్ మైండ్‌తో చూడాలి.. ఏజెంట్ ట్రోలింగ్‌పై అమల ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లోని పెద్ద ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి హీరోగా తెరంగేట్రం చేశాడు అఖిల్. సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రజల మనసు దోచుకున్న అఖిల్ మనం మూవీలో కెమియోతో అదరగొట్టాడు. తర్వాత అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా విజయం వరించలేదు. ఇప్పుడు తాజాగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు ఘోరమైన టాక్ వస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమల వాటిపై రియాక్ట్ అయ్యారు.

స్టార్ డమ్ కోసం : అక్కినేని మరో నట వారసుడు అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం ఆకట్టుకుంది. అయితే సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. దీంతో స్టార్ డమ్ తెచ్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు అఖిల్. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Amala Akkineni

స్టైలిష్ యాక్షన్ : స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించారు. ఈ ఏజెంట్ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిచాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య సందడి చేయగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు.

Amala Akkineni

దారుణంగా ట్రోలింగ్ : ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ఊహించని విధంగా తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. దీంతో రెండేళ్లకు పైగా ఈ సినిమాను చిత్రీకరించిన అఖిల్, సురేందర్ రెడ్డిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ బస్టర్ కొట్టేది : అయితే ఏజెంట్ సినిమా కోసం అఖిల్ రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్తగా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అఖిల్ కష్టానికి ప్రశంసలు వచ్చాయి. కానీ మ్యూజిక్, బీజీఎమ్, విలన్ రోల్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, కథనం సరిగా లేవని ఫ్యాన్స్ అంటున్నారు. స్క్రిప్ట్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Amala Akkineni

లోపాలు ఉన్నాయి: ఏజెంట్ సినిమాపై వస్తున్న ట్రోలింగ్ పై అక్కినేని అమల తాజాగా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. "ట్రోలింగ్ అనేది వస్తుంది. అయితే ఆ ట్రోలింగ్, అంది ఎందుకు చేస్తారు అనేది కూడా నేను అర్థం చేసుకున్నాను. నేను నిన్న ఏజెంట్ సినిమా చూశాను. పూర్తిగా ఆస్వాదించాను. సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఓపెన్ మెండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు" అని అమల రాసుకొచ్చారు.

అరుపులు, కేకలతో..: "నేను థియేటర్ లో సినిమా చూసేటప్పుడు అక్కడ సగం మందికపైగా అమ్మాయిలే ఉన్నారు. యాక్షన్ సీన్లు వస్తున్నప్పుడు అరుపులు, కేకలతో వాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నేను ఒకటి మాత్రం చెప్పగలను. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది" అని అక్కినేని అమల కొడుకు అఖిల్ కు మద్దతుగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X