twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోకు వ్యతిరేకంగా .... అమల అక్కినేనితో పాటు 15 మంది సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Amala Akkineni And Some Other Quits From Amma Association

    మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కేరళ స్టార్ హీరో దిలీప్‌ను తిరి మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ)లోకి తీసుకోవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. సినీ వర్గాలతో పాటు సాధారణ జనాల నుండి కూడా ఈ విషయమై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 'అమ్మ' నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అందులో సభ్యులుగా ఉన్న ప్రముఖ సినీ నటీమణులు అసోసియేషన్ నుండి తప్పుకుంటున్నారు. తాజాగా అమల అక్కినేనితో సహా 15 మంది డబ్ల్యుసిసి(ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సభ్యులు 'అమ్మ' తీరును నిరసిస్తూ ప్రెస్ స్టేట్మెంట్ జారీ చేశారు.

    ‘అమ్మ’ను ఇక నమ్మబోము

    ‘అమ్మ’ను ఇక నమ్మబోము

    మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ)ను తాము నమ్మబోమని, నటిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి ని తిరిగి అసోసియేషన్లోకి తీసుకోవడం దారుణమని వారు తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.

     నిందితుడికి అండగా...

    నిందితుడికి అండగా...

    ‘అమ్మ' వ్యవహారం నిందితుడికి అండగా నిలిస్తున్నట్లు ఉందని..... మీ తోటి నటికి అన్యాయం జరిగితే న్యాయం తరుపున పోరాడాల్సింది పోయి ఇలా వ్యవహరించడం దారుణమని అమల అక్కినేనితో సహా 15 మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గౌరవం లేదు

    గౌరవం లేదు

    ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం లేదని.... ఏ విషయంలోనూ లింగ సమానత్వం పాటించడం లేదని, ఇలాంటి ‘అమ్మ' పట్టించుకోక పోగా లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి మద్దతుగా నిలవడం సహించరాని విషయమని పేర్కొన్నారు.

    ఇలాంటి సంస్థలో సభ్యులగా ఉండలేం

    ఇలాంటి సంస్థలో సభ్యులగా ఉండలేం

    ‘అమ్మ' లాంటి మానవతా విలువలు పాటించని సంస్థలో తాము సభ్యులుగా ఉండలేమని, తిరిగి ఇందులో ఎప్పటికీ చేరబోమని ఈ సందర్భంగా అమల అక్కినేనితో పాటు రంజని, సజిత, కని కుశృతి తేల్చి చెప్పారు.

    దిలీప్ మీద నిషేధం ఎత్తి వేతతో వివాదం

    దిలీప్ మీద నిషేధం ఎత్తి వేతతో వివాదం

    మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ మీదకు.... పల్సర్ సునీల్ అండ్ గ్యాంగ్‌ను పంపి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంఘటన తర్వాత దిలీప్ మీద ‘అమ్మ' నిషేధం విధించింది. దాదాపు 85 జైల్లో గడిపిన దిలీప్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అతడికి ఈ కేసులో ఎలాంటి క్లీన్ చిట్ రాకుండానే మళ్లీ ‘అమ్మ'లోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

    English summary
    Amala Akkineni, Ranjani Pierre, Sajitha Madambil and Kani Kusruti among 15 other WCC members, in a statement, revealed that they cannot trust AMMA, due to the way it dealt with the Dileep-Malayalam actress abduction case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X