అఖిల్, నాగ చైతన్యలను వేరుగా వేరుగా చూస్తున్న అమల...పెళ్లి వేళ బయట పడ్డ సవతి ప్రేమ..?

అక్కినేని వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. ఓ వైపు నాగచైతన్య రెండో పెళ్లి పనులు జోరుగా జరుగుతుండగా.. మరోవైపు.. ఎవరు ఊహించని విధంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థం సందడి కొనసాగుతుంది. దీంతో ఇండస్ట్రీలో, అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోలు ఓ ఇంటి వారు కాబోతుండడంతో శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్. కానీ, అమల అక్కినేని తీరు మాత్రం భిన్నంగా ఉందంటూ.. అఖిల్ నాగ చైతన్యలను వేరువేరుగా చూస్తున్నారని టాక్ వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

అక్కినేని నాగచైతన్య- శోభితాల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. ఈ వేడుకలకు అతి కొద్ది మంది ప్రముఖులు, అతిధులను మాత్రమే పిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు పెళ్లి పనులు చివరి దశకు చేరుకున్నాయట. ఈ పెళ్లికి సంబంధించిన పలు అప్డేట్స్ ను హీరో నాగార్జున ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఈవెంట్ లో కూడా నాగచైతన్య పెళ్లి పై మాట్లాడారు.

Amala Akkineni Shares Akhil Zainab Engagement photos in social media But Naga Chaitanya shobitha Engagement photos did not share

ఇదిలాఉంటే ఎవరు ఊహించని విధంగా సడన్ సర్ప్రైజెస్ ఇచ్చారు నాగార్జున. అక్కినేని అఖిల్- జైనబ్ నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసి ఇండస్ట్రీ నే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ కు కూడా షాక్ ఇచ్చారు. ఈ సమయంలో అఖిల్ - జైనబ్ ల ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున పోస్ట్ చేస్తూ.. జైనబ్ ను తన ఇంటి కోడలుగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందంటూ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కినేని అఖిల్ జైనబ్ ఎంగేజ్మెంట్ గురించి అక్కినేని అమలా కూడా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.

'అఖిల్- జైనాబ్ ల నిశ్చితార్థం జరిగిందనే విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జైనాబ్ ను మా ఇంటికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆ యువ జంటకు మీ ప్రేమ ఆనందం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది అమల. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.కానీ నాగచైతన్య శోభిత లా నిశ్చితార్థం సమయంలో. . అమల ఎలాంటి పోస్ట్ చేయకపోవడం. ప్రస్తుతం తన కొడుకు అఖిల్ నిశ్చితార్థ సమయంలో ప్రత్యేకంగా పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Amala Akkineni Shares Akhil Zainab Engagement photos in social media But Naga Chaitanya shobitha Engagement photos did not share

ఈ తరుణంలోనే నాగచైతన్యను ఒకలాగా అఖిల్ ను మరోలాగా చూస్తుందని కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నాగార్జునకు రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. మొదట నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ళకు మనస్పర్థలతో విడిపోయారు. వీరికి సంతానమే నాగ చైతన్య. విడాకుల తరువాత హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి సంతానం అఖిల్ అక్కినేని.

నాగ చైతన్య బాల్యం మొత్తం చైన్నై లోనే గడిచింది. సమయం దొరకడంతో అప్పుడప్పుడు నాగ చైతన్య హైదరాబాద్ వచ్చేవాడు. వచ్చినప్పుడు నాగార్జునతో ఉండేవాడు. ఇలా చెన్నైలో నాగ చైతన్య పెరగడం వలన అమలకు నాగ చైతన్య దగ్గర కాలేకపోయాడనే టాక్ ఉంది. ఈ క్రమంలో నాగ చైతన్యను కొడుకుగా అంగీకరించలేకపోతున్నాడేమో అనే టాక్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X