పాపం, అమలాపౌల్ ని మోసం చేసారు
బెజవాడ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దు గుమ్మ అమలా పౌల్. ఆమె అందరి హీరోయిన్స్ లాగే..నకిలీ ట్విట్టర్ ఎక్కౌంట్ తలనొప్పికి గురైంది. అమలాపాల్ అకౌంట్ అంటూ కొందరు ఆగంతకులు ట్విటర్ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో ఆమె పేరిట అభిమానులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టడంతో ఈమెకు కంగారు పుట్టించింది. ఈ విషయమై ఈమె మాట్లాడుతూ.. ''అభిమానులతో నేరుగా మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. అందుకే ఫేస్‌బుక్ లేదా ట్విటర్‌లాంటి సోషల్ నెట్‌వర్క్ సైట్లలో అకౌంట్ ఉంటే బాగుంటుందని అనిపించింది. కానీ, అందుకు టైమ్ లేదు. అయితే, ఈ మధ్య ట్విటర్ అకౌంట్ ద్వారా నేను ఆన్‌లైన్‌లోకి వచ్చానని నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు'' అని చెప్పింది.
అలాగే... ఈ రోజుల్లో నకిలీ అకౌంట్లు మామూలే కావడంతో దీన్ని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నా పేరుతో పెట్టిన ఈ నకిలీ అకౌంట్‌తో వాళ్ళు ప్రశ్నోత్తర కార్యక్రమం నడుపుతున్నట్లు 'లవ్ ఫెయిల్యూర్' సినిమాలో నా సహ నటుడైన సిద్ధార్థ్ చెప్పడంతో నాకు ఒళ్ళు మండిపోయింది. ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాను అంది అమల పౌల్. ఇక ఈ నకిలీ సమస్యనుంచి తప్పించుకునేందుకు వెంటనే సిద్ధార్థ్ సహాయంతో ఒక ట్విటర్ అకౌంట్ మొదలు పెట్టినట్లు తెలిపింది. ఈ విషయం ఆనందంగా చెపుతూ..''ఈ అకౌంట్ మొదలుపెట్టాక సిద్ధార్థ్ దీని గురించి ట్వీట్ చేశాడు. ఆగంతకులు నా పేరుతో నిర్వహిస్తున్న నకిలీ అకౌంట్ గురించి కూడా ట్వీట్ పంపాడు. కేవలం వారం రోజుల్లో నా ట్విటర్ అకౌంట్‌ని దాదాపు 7,000 మంది ఫాలో అవుతున్నారు. ఇక అభిమానులంతా నేరుగా నాతోనే ముచ్చటించవచ్చు'' అని ముగించింది. ఇక ఆమె నటిస్తున్న లవ్ ఫెయిల్యూర్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











