రామ్ చరణ్,అల్లు అర్జున్ లపై అమలా పాల్ కామెంట్స్

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్‌ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 'మగధీర'లాంటి సినిమా చేశారు. అయినా కాస్త కూడా గర్వం ఉండదు. ఇక అల్లు అర్జున్‌... ఆ సినిమా ఇంకా మొదలు కాలేదు. కానీ బన్నీ గురించి పూర్తిగా తెలుసు. మంచి డాన్సర్‌. పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్ ఎవరైనా సరే.. బన్నీతో ఒక్క సినిమా అయినా చేయాలనుకొంటుంది. ఎందుకంటే.. డాన్స్‌ పాఠాలు ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు. ఈ మధ్య 'బద్రీనాథ్‌' చూశా. ఆయన డాన్స్ లు కొత్త తరహాలో సాగాయి అంటూ చెప్పుకొచ్చింది అమలా పాల్.

నాగచైతన్యతో 'బెజవాడ'లో ఆడిపాడిన అమలాపాల్ ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'నాయక్‌'లో నటిస్తోంది. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా అమలాపాల్‌ మీడియాతో మాట్లాడింది. తన సినీ ప్రయాణం అనుకొన్నదానికంటే గొప్పగా ఉందని అంటోంది. మంచి వ్యక్తులతో పనిచేసే అవకాశం వస్తోంది. తెలుగులో తొలి అడుగులు వేస్తున్న దశలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అని మురసిపోతూ చెప్పింది.

'నాయక్‌'లో 'శుభలేఖ రాసుకొన్న' పాట రీమిక్స్ లో నర్తించిన అనుభవాలు గురంచి చెప్తూ... 'కొండవీటి దొంగ'లోని ఆ పాటని చిత్రీకరణకి ముందు చాలాసార్లు చూశా. చిరంజీవి, రాధ... జంట చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పాటలో నృత్యాలు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. 'నాయక్‌'లో పాట అందుకు ఏమాత్రం తీసిపోదు అంది. 'నాయక్‌', 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల్లో గ్లామర్‌గానే కనిపిస్తానని అంది.

సినీ పరిశ్రమలో తన స్నేహితులెవరో చెప్తూ... కాజల్‌. మేమిద్దరం 'నాయక్‌'లో కలిసి నటిస్తున్నాం. ఆమెలో కొంచెం కూడా గర్వం లేదు. సెట్లో చాలా సరదాగా ఉంటుంది. ఆ సినిమా మూలంగా నాకు కలిగిన లాభాల్లో కాజల్‌ స్నేహం కూడా ఒకటి అని ఆనందంగా చెప్పగలను అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X