రామ్‌చరణ్ కోసం సంప్రదించిన మాట నిజమే
రామ్‌చరణ్ సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే. అయితే చర్చలు ఇంకా సాగుతున్నాయి..ఇంకా ఖరారు కాలేదు అని చెప్పింది అమాలా పౌల్. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో ఆమెను తీసుకున్నారు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మీడియాకు ఇలా క్లాఫిఫై చేసింది. ఇక 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' లో నటించే అవకాశం వస్తే వదులుకోవటానికి కారణం మహేష్‌బాబుకి వదినగా నటించడం ఇష్టం లేకపోవడం వల్ల కాదు అంటోంది. ఈ విషయమై చెప్తూ...నేనూ, దర్శకుడు పరస్పరం చర్చించుకొన్న తరవాతే... ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను. అంతేగానీ వదిన పాత్ర నచ్చక కాదు. నేను ఇక్కడకు వచ్చింది నటించడానికే అంది. హీరోయిన్ అంటే అందాల ఆరబోత అనే సిద్ధాంతానికి నేను దూరం..నాలుగు పాటల్లో కనిపించడానికి నేనే అక్కర్లేదు. అందుకు చాలా మంది నాయికలున్నారు. ఈ రోజుల్లో కథానాయికలకు నటించే అవకాశం చాలా తక్కువ. అందుకోసం నాయికా ప్రాధాన్యం ఉన్న కథలపైనే ఆధారపడతారు. అవి తరచూ రావు కదా. అందుకే ఏదైనా అవకాశం ఉన్నప్పుడే నటించేయాలి అంది. ఆమె రీసెంట్ గా సిద్దార్ద లవ్ ఫెయిల్యూర్ లో మోడ్రన్ పార్వతిగా కనిపించి అలరించింది.


Click it and Unblock the Notifications











