అమలా పాల్- విజయ్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ (పిక్చర్స్)
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో వీరి వివాహం జరుగబోతోంది. ఈ విషయం ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. విషయం అఫీషియల్‌గా బయటకు వచ్చినప్పటి నుండి.... అమలాపాల్ విజయ్‌పై తకు ఉన్న ప్రేమను తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బయట పెడుతోంది.
విజయ్ నా జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు, అతను నాపై చూపించే ప్రేమానురాగాల్లో నేను తడిచి ముద్దవుతున్నాను, అలాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుండటం ఎంతో గొప్పగా ఉందంటూ అంటూ ప్రేమ కవిత్వం ఒలకబోస్తోంది అమలా పాల్. ఆమెలో ఇంత టాలెంట్ ఉందనే విషయం తెలిసి చాలా మంది ఆశ్యర్య పోతున్నారు.
తాము ఒక్కటవ్వబోతున్నాం అనే విషయం అందిరీ తెలిసేలా....ఇద్దరూ పెళ్లికి ముందే ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. అమలాపాల్ తనకు తగిన వాడినే ఎంచుకుందని, ఇద్దరి ఈడు జోడు చాలా బాగా కుదిరిందని ఈ ఫోటోలు చూసిన వారు అంటున్నారు. స్లైడ్ షోలో ఆ అందుకు సంబంధించిన ఫోటోలు....

అమలా పాల్-ఎఎల్ విజయ్
2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఓ తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన ‘నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది

ప్రేమతో...
అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్....తమిళ హీరో విజయ్‌తో తీసిన ‘తలైవా'(తెలుగులో ‘అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు.

చెన్నైలో వివాహం
అమలా పాల్-విజయ్ వివాహం చెన్నైలో జరుగుతుంది, అయితే ఎంగేజ్మెంట్ మాత్రం కొచ్చిలో జరుపుతామని అనీస్ పాల్ తెలిపారు. జూన్ 12న వీరి వివాహం జరుగనుంది.

అలా దొరికిపోయింది
రోజూ దర్శకుడు ఎఎల్ విజయ్‌తో గంటల తరబడి మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చిన అమల పాల్ తల్లి అనీస్ పాల్ కూతురు ప్రేమ వ్యవహారాన్ని పసిగట్టింది.

తల్లి దండ్రులను కన్విన్స్ చేసిన అమలా పాల్
తొలుత అమలా పాల్ ఇంట్లో వారు వీరి వివాహానికి అభ్యంతరం చెప్పారు. అయితే అమలా పాల్ తన తల్లిదండ్రులను కవన్విన్స్ చేసి ఒప్పించింది.


Click it and Unblock the Notifications











