నాగచైనత్యనతో..నాన్న హీరోయిన్
నాగచైతన్యతో నాన్న హీరోయిన్ అంటే...కొంపతీసి వాళ్ల నాన్న నాగార్జునతో నటించిన భామలెవరైనా చైతూతో నటిస్తున్నారనుకునేరు. ఈ నాన్న ఆ నాన్న కానే కాదు. ఇటీవల విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'నాన్న". ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన అమలా పాల్ అప్పడే... తన అందం, నటనతో టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది. దీంతో నాగ చైతన్య సరన హీరోయిన్ గా నటించే చాన్సు దక్కించుకుంది.
నాగచైతన్య హీరోగా రూపొందుతున్న బెజవాడ రౌడీలు సినిమాలో ఇప్పటికే... ప్రితికారావును మెయిన్ హీరోయిన్ గా ప్రకటించారు. అయితే ఇందులో అమల పాల్ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించ బోతోంది. త్వరలోనే ఆమె బెజవాడ రౌడీలు షూటింగ్ లో జాయిన్ కాబోతోంది.
వివేక్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను...శ్రేయ ప్రొడక్షన్స్ పై రామ్ గోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్ లు రూపొందిస్తున్నారు. దసర వరకు ఈ సినిమా ప్రేక్షఃకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











