»   » నదిలోకి దూకింది...అమలా పాల్.. కారణం ఏంటంటే... (వీడియో, ఫొటోలు)

నదిలోకి దూకింది...అమలా పాల్.. కారణం ఏంటంటే... (వీడియో, ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పెళ్లి అనేది బంధీఖానా అని కొందరు అప్పుడప్పుడూ సంసార వైరాగ్యం వచ్చిన క్షణల్లో అంటూంటారు. అఫ్ కోర్స్ ..ఆ తర్వాత మళ్లీ నాలుక కరుచుకుని పెళ్లాం, లేదా మొగుడు పిల్లలు అంటూ పెనవేసుకుపోతారు. అయితే కొందరు మాత్రం అదే మాట మీద నిలబడి విడాకులకు తీసుకుంటారు. ఆ తర్వాత చాలా ఆనందంగా ఉన్నామమి చెప్తూంటూరు. అవన్ని ఏమో కానిీ... విడాకులకోసం కోర్టుకు ఎక్కాక చాలా ఫ్రీగా,హ్యాపీగా ఉంటోంది హీరోయిన్ అమలాపాల్.

  మీడియాలో తన వివాహంపై రకరకాల వార్తలు వచ్చినా, తన బ్రేకప్ గురించి ఎందరు మాట్లాడుకున్నా చిన్న కామెంట్ కూడా చెయ్యకుండా, వాటి ని ఏ మాత్రం పట్టింకుకోకుండా ధైర్యంతో ముందుకు వెళ్లిపోతోంది అమలాపాల్. అవన్ని మర్చిపోవటానికా అన్నట్లు కెరీర్ లో బిజీ అవుతోంది. అలాగే.. ఫారిన్ టూర్ పెట్టుకుని మరీ ఎంజాయ్ చేసేస్తోంది.

  భర్తతో విడిపోయిన తర్వాత అమలా పాల్ చేస్తున్న పని ఇదే...ఆశ్చర్యపోకండి

  ఉషారుగా నీళ్లలోకి దూకి

  సంసారమనే సముద్రంలోంచి బయిటకు వచ్చాక ..మిగతావన్ని సింపుల్ అనుకుందో ఏమో కానీ ఇదిగో ఇలా...అయింగ్ నదిలోకి దూకేసింది. క్రింద వీడియో చూడండి మరి.

  ఇంతకీ ఈ ఆనందం దేనికీ..

  ఇంతకీ ఈ ఆనందం దేనికీ..

  'హ్యాపీ బర్త్ డే టు మీ' అంటూ తనకు తనే విషెస్ కూడా చెప్పేసుకుంటూ అమల పాల్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే.. ఏ రేంజ్ హ్యాపీనెస్ ఫీలవుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ హ్యాపీనెస్ అంతా కేవలం బాలిలో ఎంజాయ్ చేస్తున్నందుకే లేక వేరే కారణాలు ఉన్నాయా.తను ఆనందంగానే గడుపుతన్నాను అని చెప్పటానకా అంటున్నారు.

  ధనుష్ ప్రక్కన

  ధనుష్ ప్రక్కన

  దర్శకుడు విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ స్పీడ్ పెంచింది. వరుస ఆఫర్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మ బిజీబిజీగా గడుపుతోంది. ధనుష్, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వడచెన్నై చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీన్ని దర్శకుడు మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో ధనుష్‌కు జంటగా అమలాపాల్ నటిస్తోంది.

  కొవ్వుని కరిగిస్తోంది

  కొవ్వుని కరిగిస్తోంది

  వడచెన్నై చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్నారు. వరుస ఆఫర్స్‌ రావడంతో తన శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గించి, గ్లామర్ గా కనపడేందుకు బాగానే కష్టపడిపోతుంది ఈ భామ.

  జిమ్ ఫొటోలు వదిలింది

  జిమ్ ఫొటోలు వదిలింది

  రీసెంట్ గా ఓ జిమ్ సెంటర్‌లో ఎంతో కష్టపడిపోతున్న తన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన సినీ జనాలుఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇప్పుడు ఇలా రెచ్చిపోతుంది అని కొందరు అంటూంటే, కాదు..తిరిగి తన కెరీర్ ని నిలబెట్టుకునే పనిలో పడింది మరికొందరు అంటున్నారు.

  ఎన్నడూ లేని విధంగా

  ఎన్నడూ లేని విధంగా

  మొన్నటివరకు ఎక్స్‌పోజింగ్‌ చేయనని ఖరాఖండిగా చెప్పిన ఈ భామ ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో తన సెక్సీ తనం ఎంత ఉందో చూసుకోండి అనే రీతిలో ఫొటోలకు ఫోజులిచ్చి ఆశ్చచర్యపరుస్తోంది. అలాగే..సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ కిక్ ఇస్తోంది.

  ఇలాంటి డ్రస్ లోనా

  ఇలాంటి డ్రస్ లోనా

  పెళ్లైన త‌రువాత గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దాదాపు దూరంగా ఉంటూ వ‌స్తోంది న‌టి అమ‌లాపాల్. త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడు విజ‌య్ తో విడాకులు తీసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ విడాకుల సంగ‌తి తేలిపోయిన త‌రువాత అమ్మ‌డు మొద‌టి సారీ ప‌బ్లిక్ లోకి వ‌చ్చింది. అమ్మ‌డిని చూసి అభిమానులంతా షాక్ తిన్నారు. పెళ్లైన తర్వాత ఈ అమ్మడు ఇంత హాట్ గా కనిపించడం ఇదే ఫస్ట్. మోకాళ్లకు అడుగున్నర పైవరకూ కనిపించేలా మినీ డ్రస్ వేసుకుని కనిపించడంతో అభిమానుల ఆనందాన‌కి హ‌ద్దే లేకుండా పోయింది. అమ్మ‌డు ఇక గ్లామ‌ర్ పాత్ర‌కు ఓకే చెప్ప‌బోతోంద‌ని అంటున్నారు.

  ఆమె తీరు నచ్చకే

  ఆమె తీరు నచ్చకే

  తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో వివాహ బంధాన్ని తెగ తెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచీ అమలాపాల్ మీద చాలా విమర్శలు,కామెంట్స్ వస్తున్నాయి. అత్తామామలకు ఆమె తీరు నచ్చకపోవడంవల్లే ఇదంతా జరిగిందన్నది కొందరి అభిప్రాయంతో కొందరు, మరికొందరు డైవర్స్ తీసుకుందని లోకువగా సోషల్ మీడియాలో ఆమెను ప్రస్దావిస్తూ రాస్తున్నారు.

  రిప్లైకు దిమ్మ తిరిగింది

  రిప్లైకు దిమ్మ తిరిగింది

  ఈమధ్యన 'విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌గా, నాటీగా ఉంటారు' అని ఓ ఆకతాయి సోషల్ మీడియాలో అమలా పాల్‌ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని అమలాపాల్ లైట్‌గా తీసుకోలేదు. ''ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డెరైక్షన్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లీజ్.. మహిళలను గౌరవించడం నేర్చుకో'' అని సదరు ఆకతాయికి కాస్త ఘాటుగానే కౌంటర్ రిప్లై ఇచ్చారు.

  మేమమామతో అక్రమం సంభందం

  మేమమామతో అక్రమం సంభందం

  అమలాపాల్ నీలతామరై అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళంలో వికటకవితో ప్రవేశించి వీరశేఖరన్, సింధు సమవేళి చిత్రాల్లో నటించారు. ఇవేవీ పెద్దగా తన కేరీర్‌కు ప్లస్ కాలేదు. అయితే సింధు సమవెళి చిత్రంలో మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి పాత్రలో నటించి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే అది ఆమెకు ఓ రకంగా మంచి ఫ్రీ ప్రచారాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.

  తెలుగులోనూ బాగానే

  తెలుగులోనూ బాగానే

  బాల్యం నుంచీ నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ అమలా పాల్ ప్లస్ టూ పూర్తయ్యే దాకా తన మనసులోని మాటను బయట పెట్టలేదు... ఆ తరువాత చదువు కంటే అభినయంపైనే అమలా పాల్ మక్కువ చూపించింది. ఆపైన టాలీవుడ్ చూపు అమలవైపు సాగింది... 'బెజవాడ'లో నాగచైతన్య సరసన తొలిసారి తెలుగులో నటించింది అమలా పాల్... ఆ పైన సిద్ధార్థ్ జోడీగా 'లవ్ ఫెయిల్యూర్'లోనూ, 'నాయక్'లో రామ్ చరణ్ జోడీగానూ, 'ఇద్దరమ్మాయిలతో' లో అల్లు అర్జున్ సరసన అమలా పాల్ నటించి అలరించింది.

  అలా ప్రేమగా మారి

  అలా ప్రేమగా మారి

  తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో తనదైన బాణీ పలికిస్తూ అమలా పాల్ సాగింది... దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తో పరిచయం ప్రణయంగా మారి, తరువాత పరిణయంగా పరిణామం చెందడం విశేషం... విజయ్ దర్శకత్వంలో అమలా పాల్ "దైవ తిరుమగల్, తలైవా" చిత్రాల్లో నటించింది... పెళ్ళయిన తరువాత కూడా అమలా పాల్ ... మోహన్ లాల్ సరసన అమల నటించిన 'లైలా ఓ లైలా' ఆకట్టుకుంది... హీరో సూర్య నిర్మించిన 'పసంగ-2'లోనూ అమలాపాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించింది.

  పెద్దలు నచ్చ చెప్పినా

  పెద్దలు నచ్చ చెప్పినా

  రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న నటి అమలా పాల్‌.. భర్త ఏఎల్‌ విజయ్‌తో విడిపోవటానికి నిర్ణయించుకుని డైవర్స్ కు అప్లై చేసిన సంగతి తెలిసిందే. భేదాభిప్రాయాల కారణంగా ఇద్దరూ పరస్పరం విడిపోవాలనుకుంటున్నారని, విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు వీరిద్దరికి నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది.

  ఆనందం ఎక్కడనుంచో రాదు

  ఆనందం ఎక్కడనుంచో రాదు

  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త విజయ్ నుంచి విడిపోయిన నటి అమలాపాల్ లైఫ్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు 'చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకు ముందు శిక్షణ పొందిన యోగాతో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాను.ఆనందం అన్నది బయట ఎక్కడ నుంచో రాదు. అది మనలోనే ఉంటుం ది. అయినా నేను నటినవ్వడం, ప్రేమ, పెళ్లి, విడిపోవడం, ఇప్పుడిలా భేటీ ఇవ్వడం అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది' అని బదులిచ్చారు.

  చంద్రికా సోప్ తో

  చంద్రికా సోప్ తో

  అమలాపాల్ గత మూడు సంవత్సరాలుగా చంద్రిక సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా ముంబైలో ఆమె షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయాన్ని అమలాపాల్ తెలియచేసింది.అమలా పాల్ చేస్తున్న చంద్రికా సోప్ యాడ్ షూటింగ్ కు చెందిన ఫొటోను ఆమె స్వయంగా ఇనిస్ట్రగ్రామ్ లో షేర్ చేసింది.

  ఇప్పుడే ఫుల్ జోష్

  ఇప్పుడే ఫుల్ జోష్

  భర్తతో విభేధాలు వచ్చి విడిపోయాక ఒంటిరగా ఉన్న అమలాపాల్ ... తనకు ఇష్టమైన స్నేహితురాళ్లను కలుస్తోంది. వాళ్లతో సరదాగా గడుపుతోంది. ఆ ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందనుకోండి

  అవకాశమున్న చోటికి

  అవకాశమున్న చోటికి

  చెన్నైలో జరిగిన సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. స్టార్ క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ లీగ్ పోటీల్లో చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరులలో జరుగుతోంది. ఫైనల్ పోటీలు మలేషియా రాజధాని కోలాలంపూర్‌లో జరుగుతోంది. ఇందులో చెన్నై తరపున ఆడే క్రీడాకారులను పరిచయం చేసే కార్యక్రమంలో చెన్నైలో జరిగింది.

  ఎక్కడా వెనకడుగు వెయ్యిలేదు

  ఎక్కడా వెనకడుగు వెయ్యిలేదు

  విడాకుల విషయమై అమలా పాల్‌పైనే మీడియా, సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోశాయి. అమలాపాల్ వ్యక్తిగత వ్యవహారాన్ని సోషల్ మీడియా, ఆన్ లైన్ మీడియా రోడ్డుకీడ్చాయి. అయితే ఇలాంటి ఆరోపణలకు సాధారణంగా మహిళలు కుమిలిపోతారు. కానీ అమలా పాల్ మాత్రం విమర్శలను ధీటుగా ఎదుర్కొంది.

  సందిగ్దంలో నిర్మాతలు

  సందిగ్దంలో నిర్మాతలు

  ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక్కటే అమలాపాల్ చేతిలో ఉంది. పలువురు దర్శక నిర్మాతలు అమలాపాల్‌ను తమ చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గుమ్మం ఎక్కారో అప్పటి నుంచి అమలాపాల్‌ను తమ చిత్రాల్లో ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారని సమాచారం. ఇది నిజంగా అమలాపాల్‌ను షాక్‌కు గురి చేసే విషయమే.

  ఏది నిజమో..ఏది అబద్దమో..

  ఏది నిజమో..ఏది అబద్దమో..

  పరస్పర అంగీకారంతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కడం.. ఈ వ్యవహారం మొత్తం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ పలు చిత్రాల్లో నటించారు. దర్శక-నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అవకాశాలివ్వడానికి సుముఖంగా లేరట. దానికి కారణం ఏ.ఎల్.విజయ్ తండ్రి అళగప్పన్ అని సమాచారం. ఏ.ఎల్.అళగప్పన్ నటుడు, సీనియర్ నిర్మాత కూడా.

  తమిళ మీడియా ఇలా అంటోంది

  తమిళ మీడియా ఇలా అంటోంది

  అమలాపాల్ విడాకులు విషయమై అనేక రూమర్స్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒకటి...హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అన్నది మీరు ఇక్కడ చదవవచ్చు..

  అమలాపాల్ డైవర్స్ లో షాకింగ్ ఏంగిల్: ప్రొడ్యూసర్ తో నైటంతా గడపటం వల్లే ఇదంతా?

  English summary
  Amala Paul 's kicking time like never before from Cochin to USA to Malaysia to Bali, Indonesia. On the eve of her birthday, Amala wished herself and posted the lines "Happy birthday to meeeeeeeee!!! #letgo #likemonkey #monkeyisland". Along with this, she tagged a video, of course a slow motion one, where she's seen slipping into river from a swing. And this adventure is sure going to surprise all. Well, it seems like she's ready to kick more fun to keep her life more happier.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more