అవి నా పెళ్లి ఫోటోలు కాదు.. వాళ్ల కోసమే అలా రొమాన్స్ చేశాం: అమలా పాల్ షాకింగ్ రియాక్షన్

By Manoj Kumar P

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సంప్రదాయ పాత్రలు చేస్తూ.. ఎంతో మందిని ఆకట్టుకుంది మలయాళ బ్యూటీ అమలా పాల్. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించడంతో ఆమె ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను సైతం అందుకుంది. అలా.. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి సత్తా చాటింది. సినీ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నప్పటికీ.. పర్సనల్ లైఫ్ మాత్రం ఒడిదుడుకులతో వెళుతోంది. ఇప్పటికే ఒకరితో విడిపోయిన అమలా.. తాజాగా మరొకరిని పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

Amala Paul Reacts On Her Latest Viral Photos
చాలా ట్రై చేసింది.. సక్సెస్ మాత్ర కాలేదు

చాలా ట్రై చేసింది.. సక్సెస్ మాత్ర కాలేదు

‘నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది అమలా పాల్. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంటరై కొన్ని సినిమాల్లో నటించింది. ఆ రెండు చోట్లా సక్సెస్‌ను అందుకున్న ఆమెకు తెలుగులో మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడ అమలా పాల్ నటించిన నాలుగు సినిమాలు ‘బెజవాడ', ‘నాయక్', ‘ఇద్దరమ్మాయిలతో' ‘జెండాపై కపిరాజు' ఫట్ అన్నాయి.

ఊపులో ఉన్నప్పుడే పెళ్లి.. వెంటనే విడాకులు

ఊపులో ఉన్నప్పుడే పెళ్లి.. వెంటనే విడాకులు

వరుస సినిమాలతో సత్తా చాటుతున్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని షాకిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

విడాకుల తర్వాత న్యూడ్‌గా రెచ్చిపోయింది

విడాకుల తర్వాత న్యూడ్‌గా రెచ్చిపోయింది

విజయ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె పలు మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘ఆమె/అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దీంతో అమలా పాల్ చేసిన సాహసం చర్చనీయాంశం అయింది.

అమల జీవితంలోకి ధనూష్ రావడంతో

అమల జీవితంలోకి ధనూష్ రావడంతో

ధనూష్ వల్లే అమలా పాల్‌తో తన కొడుకు విడాకులు తీసుకున్నాడని ఆమె మాజీ మామ అళగప్పన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘విజయ్‌ను వివాహం చేసుకున్నప్పుడు అమల సినిమాల్లో నటించనని చెప్పింది. కానీ, ధనూష్ నిర్మించిన ఒక సినిమాలో మాత్రం మాకు తెలియకుండానే నటించింది. ఇది వివాదానికి కారణం అయింది' అని ఆయన చెప్పుకొచ్చారు.

సింగర్‌తో అమలా పాల్ రెండో వివాహం

సింగర్‌తో అమలా పాల్ రెండో వివాహం

కొద్ది రోజులుగా అమలా పాల్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం.. ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగించడమే. అంతేకాదు, తాజాగా వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం మొదలైంది. అదే సమయంలో దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో అమల పెళ్లి చేసుకుందని అంతా అనుకుంటున్నారు.

అవి పెళ్లి ఫోటోలు కాదు.. వాళ్ల కోసమే రొమాన్స్

అవి పెళ్లి ఫోటోలు కాదు.. వాళ్ల కోసమే రొమాన్స్

పెళ్లి గురించి ఇంత రచ్చ జరుగుతున్నా అమలా పాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది. ‘నేను రెండో పెళ్లి చేసుకోలేదు. నెట్‌లో ఉన్న ఫొటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫొటో షూట్‌లో భాగమైనవి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతాను' అంటూ క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X