సోషల్ మీడియాలో నా ఫోటోలు లీక్ చేశారు.. ప్రియుడిపై అమలాపాల్ కేసు!
దక్షిణాది స్టార్ హీరోయిన్ అమలా పాల్ పెళ్లి వార్త కొద్ది నెలల క్రితం సంచలనం రేపింది. బాలీవుడ్ సింగర్ భవిందర్ సింగ్‌తో పెళ్లి జరిగినట్టు వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త అభిమానులు, సినీ ప్రముఖులను ఓ రకమైన తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఇప్పుడు భవిందర్ సింగ్‌పై కేసు నమోదు చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకు వారిద్దరి మధ్య ఎలాంటి వివాదం నెలకొన్నదంటే..

ప్రముఖ దర్శకుడితో విడాకులు
గతంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలపాల్ ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకొన్నారు. అయితే దాదాపు రెండేళ్లు దాంపత్య జీవితం సాగింది. ఆ తర్వాత వారి మధ్య వ్యక్తిగత విభేదాలు నెలకొన్నడంతో వారిద్దరి విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. దాంతో 2016లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు.

భవిందర్ సింగ్‌తో ప్రేమలో
ఏఎల్ విజయ్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత అమలాపాల్ ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత భవిందర్ సింగ్‌తో ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య డేటింగ్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. ఉత్తరాదిల పలు వేడుకల్లో పాల్గొన్నారు. అలాంటి పరిస్థితుల్లో భవిందర్ సింగ్‌తో సంప్రదాయబద్దంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తెలిసిందే.

పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో
ఇక సోషల్ మీడియాలో అమలాపాల్‌తో పెళ్లి జరిగిందంటూ తెలియచేస్తూ భవిందర్ సింగ్ ఫోటోలు చేసిన ఫోటోలు వివాదాస్పదంగా మారాయి. దాంతో అమలాపాల్ స్వయంగా తన పెళ్లి వార్తలపై ఖండించారు. ఇవి వేరే వేడుకలో తీసిన ఫోటోలు అంటూ అమలాపాల్ వివరణ ఇచ్చారు. దాంతో ఆ వివాదానికి తెర పడింది.

మాజీ ప్రియుడిపై కేసు
అయితే తన వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగిందంటూ ఇటీవల అమలాపాల్ కోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని కోర్టు ఆశ్రయించిన నటి న్యాయమూర్తి సతీష్ కుమార్ అనుమతి తీసుకొన్నారు. ఆ తర్వాత భవిందర్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. తన గురించి రూమర్లు ప్రచారం చేశారు అని ఫిర్యాదు చేశారు. ఆ వివాదం తర్వాత భవిందర్ సింగ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి అన్ ఫాలో అయ్యారు.


Click it and Unblock the Notifications











