»   » పాపం అమలా పాల్... ఇంత ధారుణమా..!? సినిమా కోసం కాపురాన్నే వదులుకుంటే.

పాపం అమలా పాల్... ఇంత ధారుణమా..!? సినిమా కోసం కాపురాన్నే వదులుకుంటే.

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యూటీ అమలాపాల్, క్రేజీ డైరెక్టర్ విజయ్‌ల విడాకుల వ్యవహారం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఈ విషయంపై విజయ్ తల్లిదండ్రులు ఇప్పటికే కొన్ని స్టేట్‌మెంట్స్ ఇచ్చిన అమలాపాల్ నుండి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు. పెళ్ళైన తర్వాత సినిమాలు చేస్తే వారి వైవాహిక జీవితం దెబ్బతింటుందని , అందుకే అమలాపాల్‌ని సినిమాలు మానేయమని విజయ్ తల్లిదండ్రులు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అమలా పాల్ వారి మాటను లెక్క చేయకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నందున విజయ్ విడాకులు తీసుకుంటున్నాడనేది కోలీవుడ్ సమాచారం.

అమ‌లా పాల్ కు వ్య‌తిరేకంగా ఆమె భ‌ర్త.. ఆమె మామ మీడియాకెక్కి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఐతే ఆమె మాత్రం ఒక్క మాటా మాట్లాడకుండా సైలెంటుగా త‌న ప‌ని తాను చేసుకుపోయింది. విడాకుల వార్త‌ల‌పై.. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ఒక్క మాటా మాట్లడలేదు. తన వ్యక్తిగత స్వతంత్రం కోసం జీవితం లోని ముఖ్యమైన బంధాన్ని వదిలేసింది. అయితే ఇప్పుడు ఆమె కుతగిలిన షాక్ మాత్రం మాములుగా లేదు... ఏ సినిమా కోసమైతే ఆమె ఇంత రిస్క్ తీసుకుందో ఇప్పుడు ఆ సినిమా నుంచే ఆమెను తప్పిస్తున్నారని సమాచారం.

తెలుగులో

తెలుగులో

'బెజవాడ', 'నాయక్‌' తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అమలా పాల్‌, ఎక్కువగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. అందులో గ్లామర్‌కి దూరంగా చేసిన సినిమాలే ఎక్కువ.

షాక్ మీద షాక్

షాక్ మీద షాక్

కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ని ప్రేమించి పెళ్ళాడి షాక్ ఇచ్చిన అమలాపాల్‌, రెండేళ్ళు తిరగకుండానే వైవాహిక బంధాన్ని కాదని ఇంకో సారి అందర్నీ విస్తుపోయేలా చేసింది.

క్లారిటీ లేదు

క్లారిటీ లేదు

తామెందుకు విడిపోతున్నామన్నదానిపై అటు అమలాపాల్‌, ఇటు విజయ్‌ స్ట్రెయిట్‌గా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. 'అభిప్రాయ బేధాలతో కలిసి కాపురం చేయలేం..' అని మాత్రమే చెప్పి, వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు అమలా పాల్‌, విజయ్‌.

రచ్చ రచ్చ చేసారు

రచ్చ రచ్చ చేసారు

అయితే ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రం ఈ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేసారు. విజయ్ తండ్రి అమలాపాల్ మీద తీవ్రంగా మండిపడ్డాడు.

మాట తప్పింది

మాట తప్పింది

'పెళ్ళయ్యాక సినిమాల్లో నటించను..' అని ముందు చెప్పిన అమలా పాల్‌ ఆ తర్వాత మాట తప్పిందనీ, అది ఇష్టం లేకనే తమ కుమారుడు విజయ్‌, అమలా పాల్‌తో తెగతెంపులు చేసుకున్నాడన్నది విజయ్‌ తల్లిదండ్రుల వాదన.

సైలెంట్ గానే ఉన్నారు

సైలెంట్ గానే ఉన్నారు

ఈ వివాదాన్ని పెంచి పోషించడం ఏమాత్రం ఇష్టం లేని అమలా పాల్‌, విజయ్‌.. ఇద్దరూ సైలెంటయిపోయారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ పోయారు.

చిన్న సంగతి

చిన్న సంగతి

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమలా పాల్‌ కే ఎక్కువ మద్దతు వచ్చింది. ఈ రోజుల్లో పెళ్ళయ్యాక సినిమాల్లో నటించడం అనేది చాలా చాలా చిన్న విషయం.

అమల కే సపోర్ట్

అమల కే సపోర్ట్

అందులోనూ అమలా పాల్‌ గ్లామరస్‌ పాత్రలు చేసింది కూడా తక్కువే. మరి, ఆమెపై ఎందుకింత వివాదం.? అంటూ సినీ ప్రముఖులు విజయ్‌ కుటుంబ సభ్యుల తీరునే తప్పు పడ్తుండడం గమనార్హం.

ఇష్టం లేదు

ఇష్టం లేదు

అసలు సంగతేమిటంటే ధనుష్‌తో సినిమా చేయడం అమల కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దాంతో ఆ సినిమా చెయ్యొద్దంటూ ఆంక్షలు విధించారు. అత్తింటి వారి ప్రవర్తన నచ్చని అమల విడాకుల దాకా వెళ్ళింది.

ఎదురు దెబ్బ తగిలింది

ఎదురు దెబ్బ తగిలింది

సినిమా కోసం కాపురాన్ని కూడా పణంగా పెట్టిన అమలకు అనుకోని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. ఏ సినిమా కోసమైతే భర్తనూ, కాపురాన్నీ కాలదన్నుకుందో ఆ సినిమా నుంచి అమలను తప్పించారన్న వార్త బాగా హల్‌చల్‌ చేస్తోంది.

మరొకరిని

మరొకరిని

అమల విషయంలో జరుగుతున్న గొడవలు చూసిన యూనిట్‌ ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించుకుందట.

తప్పించబోతున్నారు

తప్పించబోతున్నారు

కొన్ని రోజులుగా అతు కోలీవుడ్ లోనూ.., ఇటు టాలీవుద్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది అమల పాల్ వ్యవహారం. ఓ సినిమా అమల కాపురంలో చిచ్చు పెట్టింది. అదే సినిమా నుంచి ఇప్పుడు ఆమెను తప్పించబోతున్నారు.

ధనుష్‌ భార్య ఐశ్వర్య

ధనుష్‌ భార్య ఐశ్వర్య

ధనుష్‌ మూవీలో నటించే ఛాన్స్ అమ‌లా కి ఇవ్వకూడదని చిత్ర యూనిట్‌ డిసైడ్‌ అయినట్టు కోలీవుడ్ స‌మాచారం . ధనుష్‌ భార్య ఐశ్వర్య అమలాపాల్ తో మూవీ చేయోద్దని గట్టిగా చెప్పింద‌ట‌.

అనాధికారంగా బ్యాన్

అనాధికారంగా బ్యాన్

మరో వైపు అమలాపాల్ పై అనాధికారంగా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఎల్. అలగప్పన్ పేరున్న నిర్మాత, నటుడు, తమిళ సినిమా ప‌రిశ్ర‌మ‌ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు వుండ‌డంతో అమలా పాల్ పై నిషేధం వేయాలని కొందరు కోలీవుడ్ నిర్మాతలు కూడా ఓడెసిష‌న్ కి వచ్చినట్టు సమాచారం.మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా యూనిట్ మాత్రం

సినిమా యూనిట్ మాత్రం

కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం వేరే కారణం చెప్తోంది. ఈ సినిమాలో అమలను కొనసాగిస్తే దాని ఫలితం సినిమా సక్సెస్‌ మీద పడుతుందేమోనన్న భయంతో చిత్రం యూనిట్‌ ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

ధారుణం

ధారుణం

ఏదేమైనా అమలా పాల్ పరిస్థితి మాత్రం అయోమయంగా తయారయ్యింది. అలగప్పన్ తన పగ తీర్చుకోవటానికి ఆమె కెరీర్నే నాశనం చేయాలని చూడటం మాత్రం ధారుణం.

English summary
Amala paul divers controversy is now effecting her career... latest buzz is that Amala is now out from the Movie cast "vada chennai"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu