విశాఖలో నాగచైతన్య లవర్ హల్‌చల్!
బెజవాడ సినిమాలో నాగచైతన్య లవర్‌గా నటించిన అమలపాల్ విశాఖపట్నంలో శనివారం హల్ చల్ చేసింది. ఓ షాపు ఓపెనింగుకు వచ్చిన ఆమెను చూడటానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అమల మీడియాతో మాట్లాడుతూ... బెజవాడ సినిమాలో తను చేసిన క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది, ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో పలు అవకాశాలు వస్తున్నాయి, జనవరిలో తాను నటించిన సినిమాలు విడుదల కాబోతున్నాయి అని చెప్పుకొచ్చారు. తెలుగు ఆడియన్స్, హైదరాబాద్ తనకు చాలా ఇష్టం అన్నారు.
అమల ప్రస్తుతం సిద్ధార్థతో 'కధలిల్ సోధపువదు ఎప్పడి" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగులోనూ విడుదల కాబోతోంది. హరి డైరెక్షన్ లో రాబోతోన్న సూర్య నెక్స్ట్ ఫిలింలో నటించేందుకు కూడా అమల సంతకం కూడా చేసేసింది. ఇంతకుముందు హరి- సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'సింగం" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











