రామ్ చరణ్ 'నాయక్‌' గురించి అమలాపాల్

By Srikanya

హైదరాబాద్ ''ప్రస్తుతం నేను నటిస్తున్న 'నాయక్‌', 'జెండాపై కపిరాజు' చిత్రాల్లోని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చేవే. రామ్ చరణ్ తో చేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుగులో గ్యారెంటీగా బ్రేక్ వస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది అమలా పాల్. రామ్ చరణ్, వినాయిక్ కాంబినేషన్ లో రూపొందనుతున్న 'నాయక్‌' చిత్రంలో ఆమె సెకండ్ హరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్యతో చేసిన బెజవాడ చిత్రం ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. తర్వాత విక్రమ్ సరసన చేసిన నాన్న చిత్రంతో ఆమెకు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ 'నాయక్‌' పైనే ఉన్నాయి.

వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్ గా చేస్తున్నారు . దర్శకుడు గురించి అమలాపాల్‌ చెపుతూ.... '' సినిమాకు కెప్టెన్‌ దర్శకుడు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. సినిమాలోని ప్రతి పాత్ర ఎలా ఉండాలో ఆయన ముందుగానే అనుకుంటారు. దాని ప్రకారమే నటుల్ని ఎంపిక చేసుకుంటారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన దర్శకులందరూ కథపై పట్టున్న వారే '' అంటోంది అమలాపాల్‌.

అలాగే ''సినిమా సెట్స్‌పైకి వెళ్లాక నా పాత్రలో చిన్న చిన్న మార్పులు సహజం. అలాంటివి నేను పట్టించుకోను. పాత్రలో మార్పులు చేయడానికి సరైన కారణం ఉంటే సర్దుకుపోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ మొత్తం నా పాత్ర తీరుతెన్నులే మారిపోతే మాత్రం వూరుకోను. ఇప్పటి వరకూ నాకు ఆ పరిస్థితి రాలేదు. భవిష్యత్తులో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. ఏ దర్శకుడైనా ఓ మంచి చిత్రం రూపొందించాలనే తపనతోనే పనిచేస్తాడు. చిన్న చిన్న విషయాలకు కంగారుపడితే పాత్రకు న్యాయం చేయలేం'' అంది.

జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే 'నాయక్‌' చిత్రంలో వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X