రూ. కోటికి ఎగబాకిన అమలా పాల్, మెగా హీరోల ఎఫెక్టేనా?

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయన్ అమలా పాల్ నిన్నమొన్నటి వరకు సెకండ్ గ్రేడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటూ అగ్రహీరోయిన్ల సరసన స్థానం దక్కించుకుంది. త్వరలో ఆమె మంచు మనోజ్ హీరోగా, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమాకు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది.

ఇదంతా 'మెగా' హీరోలతో సినిమాలు చేయడం వల్లనే అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రెండేళ్ల క్రితమే 'బెజవాడ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకలకు పరిచయమైన అమలా పాల్ ఆ చిత్రం పరమ ప్లాపు కావడంతో టాలీవుడ్లో అడ్రస్ లేకుండా పోయింది. ఆ మధ్య లవ్ ఫెయిల్యూర్ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేక పోయింది.

అయితే ఇటీవల అమలా పాల్ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'నాయక్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమల సుడి తిరిగింది. వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో మెగా హీరో అల్లు అర్జున్‌‍తో కలిసి 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

ఇలా వరుసగా మెగా హీరోలు, టాప్ డైరెక్టర్ల చేతిలో పడటంతో అమలా పాల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా అమలా పాల్ అందాలను, పెర్ఫార్మెన్స్‌ను తమ సినిమాల్లో ట్రై చేస్తున్నారు. మరి ఈ ఊపును అమలపాల్ ఎంతకాలం నిలబెట్టుకుంటుందో?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X