బెంజ్ వెకేషన్ క్లబ్‌లో అమలా పాల్ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బెంజ్ వెకేషన్ క్లబ్‌లో సందడి చేసారు. ఈ సందర్భంగా అమలా పాల్ మాట్లాడుతూ....ఇప్పటికే చెన్నైలో బెంజ్ వెంకేషన్ క్లబ్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని, కుటుంబ సమేతంగా వచ్చి సేద తీరడానికి బెంజ్ వెకేషన్ క్లబ్‌లను ఎంచుకోవడం ఒక మంచి ఆప్షన్ అని ఆమె చెప్పుకొచ్చారు.
నిర్వాహకులు మాట్లాడుతూ.....తమ వినియోగ దారుల కోసం ఎలాంటి రాజీ పడకుండా లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నామని, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిపారు. రెస్టారెంట్, స్పా, బార్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ ఫూల్, కాన్ఫరెన్స్ హాల్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. ఒకసారి బెంజ్ వెకేషన్ క్లబ్‌కు వస్తే ఫ్యామిలీ మొత్తానికి మరిచిపోలేని అనుభూతి మిగులుతుందని తెలిపారు.
ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

బెంజ్ వెకేషన్ క్లబ్
బేగం పేటలో కొత్తగా ఏర్పాటైన బెంజ్ వెకేషన్ క్లబ్ ప్రారంభిస్తున్న అమలా పాల్.

అమలా పాల్
బెంజ్ వెకేషన్ క్లబ్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న హీరోయిన్ అమలా పాల్.

ఏర్పాట్లపై అమలా పాల్ సంతృప్తి
బెంజ్ వెకేషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని అమలా పాల్ చెప్పుకొచ్చారు.

అమలా పాల్ సినిమాలు
అమలా పాల్ సినిమాల విషయానికొస్తే...అమలా పాల్ నటించిన ‘జెండాపై కపిరాజు' అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు రెండు తమిళ సినిమాలు, ఓ మళయాల చిత్రంలో ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











