Don't Miss!
- News
chicken kebab: కబాబ్ లో ఒక్క పీస్ తక్కువ వచ్చింది, హోటల్ ఓనర్ ను ఏం చేశారంటే ?, కలికాలం !
- Automobiles
రూ. 5.69 లక్షలకే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్.. బుకింగ్స్ కూడా మొదలైపోయాయ్
- Lifestyle
Republic Day 2023: రిపబ్లిక్ డే రోజు బీటింగ్ రీట్రీట్.. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Finance
Adani News: నీటిపై కన్నేసిన అదానీ ఎంటర్ప్రైజెస్.. రూ.20 వేల కోట్ల సేకరణ దేనికంటే..?
- Sports
పట్టువీడని రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ పదవికి బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామా!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
అమలా పాల్ భయపడిందే జరిగింది.. మొత్తం లీక్ చేసేశారు.. అక్కడి వాళ్లే కారణం
Recommended Video
అమలా పాల్.. కెరీర్ ఆరంభంలో డీసెంట్ క్యారెక్టర్లు చేసి ఇప్పుడు మాత్రం హాట్ హాట్ పాత్రలు చేస్తున్న నటి. ప్రస్తుతం ఈమె పేరు హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన అమలా పాల్ గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం తాజాగా అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. అంతలోనే భారీ షాక్ కూడా తగిలింది.

తెలుగులో ఒకలా.. తమిళంలో మరోలా..
రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, తెలుగుతో పోలిస్తే.. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

మొత్తం లీక్ చేసేశారు
ఈ సినిమా వచ్చి రెండు రోజులు కూడా గడువక ముందే ఇది ఆన్‌లైన్‌లో లీక్ అయింది. తమిళ రాకర్స్ దీన్ని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో ఉంచేసింది. వీకెండ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అంతేకాదు, సినిమాలో హైలైట్ అయిన న్యూడ్ సీన్ ముందే బయటకు రావడంతో సినిమాకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

సినిమా కోసం సరికొత్తగా ప్రమోషన్
‘అడై'/‘ఆమె' కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసింది. ఇందులో భాగంగానే అమలా పాల్ న్యూడ్ సీన్‌ను సోషల్ మీడియాలో పెట్టడం.. థియేటర్లకు వెళ్లి స్వయంగా పబ్లిక్ టాక్ తెలుసుకోవడం వంటివి చేసింది. ఈ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు లీక్ అవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.

మొన్న ‘ఇస్మార్ట్ శంకర్' కూడా..
సినీ ఇండస్ట్రీకి ‘తమిళ రాకర్స్' వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. సినిమా విడుదల అవడం.. 24 గంటలు గడువక ముందే పైరసీ చేసి ఆన్‌లైన్ పెట్టేయడం వంటివి చేస్తూ ఫిల్మ్ మేకర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత వారం విడుదలైన రామ్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్'ను 24 గంటలు గడువక ముందే ఆన్‌లైన్‌లో పెట్టేసిందీ వెబ్‌సైట్.

అడై గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.