శివ+గీతాంజలి=బెజవాడ
టైటిల్ చూసి కంగారుపడకండి. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడలో నాగార్జున సినిమాల మీద ఉన్న మక్కువతో ఏమో కానీ హీరో పేరు శివకృష్ణ(నాగచైతన్య), హీరోయిన్ పేరు గీతాంజలి(అమలా పౌల్) అని పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా సంగతి వదిలేసి ఇదే హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. హీరో,హీరోయిన్స్ పేర్లు దగ్గరనుంచి దర్శకుడు వివేక్ కృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాలపై ఈ వర్మ వివరణ ఇస్తూ..."నేను సృష్టించిన 'శివ'లోని శివ పాత్రకి, వివేక్ సృష్టించిన 'బెజవాడ'లోని శివకృష్ణ పాత్రకి చాలా వైవిధ్యం ఉంది ..1989లో 'శివ' విడుదలైనప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి 'శివ' కథ, కథలోని పాత్రలు పుడితే... 20 ఏళ్ళుగా సినిమాల్లోనూ, బయటా మారుతూ వచ్చిన ఎన్నో పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వివేక్ తన స్టయిల్‌లో 'బెజవాడ' తీశాడు. నేను ఆ టైమ్‌లో 'గాడ్‌ఫాదర్', 'అర్జున్', 'అర్ధసత్య' లాంటి చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొందాను.
తను 'శివ', 'సర్కార్' లాంటి నా సినిమాలతో పాటు తనకిష్టమైన దర్శకులను ఆకళింపు చేసుకుని తనదైన శైలిలో 'బెజవాడ'ను తీశాడు అన్నారు.'శివ'లో చాలా పాపులర్ అయిన సైకిల్ ఛేజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను తీసుకుని తన స్టైల్‌లో మోడ్రనైజ్ చేసి 'బెజవాడ'లో వాడాడు'' అని చెప్పారు. వివేక్ కృష్ణ మాట్లాడుతూ ..పలువురు అనుకుంటున్నట్టుగా 'శివ' చిత్రానికి నా 'బెజవాడ'కు ఎలాంటి పోలిక లేదు. 'శివ'లో నాగార్జున అండర్‌డాగ్‌గా మొదలై మెల్లగా హీరోగా ఎదుగుతాడు. కానీ నా 'బెజవాడ'లో చైతన్య మొదట్నుంచీ హీరోయే. అలాగే 'బెజవాడ' కథకీ, 'శివ' కథకీ ఏమాత్రం సంబంధం లేదు. కొత్త దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. అందులో వర్మ కూడా ఒకరు తప్ప, ఆయన ఒక్కరే కాదు. అక్కడక్కడా నాకు నచ్చిన షాట్స్, సీన్లను 'బెజవాడ'లో కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications











