Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య కన్నా పెద్దదానిలా ఉందనే...
మొదట మేం నాగచైతన్య సరసన ప్రీతికారావునే ఎంపిక చేసాం.రెండు రోజులు షూటింగ్ కూడా విజయవాడలో చేసాం.కానీ ఆమె చూస్తుంటే నాగచైతన్య కన్నా పెద్దదానిలా ఉంది.దాంతో ఏం చేయాలి అని ఆలోచనలో ఉండగా నాన్న సినిమాలో అమలా పౌల్ ని చూడటం జరిగింది.వెంటనే అప్రోచ్ అయ్యాం.అంతే తప్ప ప్రీతికారావుతో ఏ సమస్యలూ లేవు.త్వరలోనే ఈ కొత్త పెయిల్ తో షూటింగ్ జరపుతాం అంటున్నారు బెజవాడ రౌడీలు యూనిట్ సభ్యులు.నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బెజవాడ రౌడీలు". ఈ చిత్రంని అక్టోబర్ 21 న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక ఈ చిత్రం ఎనభైల్లోనూ,తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్,యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా నాన్న ఫేమ్ అమలా పౌల్ ని ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.